ఎయిర్‌టెల్ మనీకి రూ.20,000 కోట్ల నిధులు
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:13 AM
ఎయిర్‌టెల్ తన అనుబంధ ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ‘ఎయిర్‌టెల్ మనీ లిమిటెడ్ (ఏఎంఎల్)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది....
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ తన అనుబంధ ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ‘ఎయిర్‌టెల్ మనీ లిమిటెడ్ (ఏఎంఎల్)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆ సంస్థకు రూ.20,000 కోట్ల నిధులు సమకూర్చనుంది. ఇందులో 70ు నిధులను తాము, మిగతా 30 శాతం నిధులను తమ ప్రమోటర్ గ్రూప్ భారతీ ఎంటర్‌ప్రైజెస్ సమకూరుస్తుందని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ఆర్‌బీఐ ఈ నెల 13వ తేదీన ఎయిర్‌టెల్ మనీకి ఎన్‌బీఎ్‌ఫసీ లైసెన్సు మంజూరు చేసింది. ఏఎంఎల్ ఇప్పటికే రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. తాజా నిధులతో ఏఎంఎల్ రుణ వితరణ సామర్ధ్యం మరింత పెరుగుతుందని భారతీ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..