Share News

ఎయిర్‌ ఇండియాలో ‘బేసిక్‌ ఫేర్‌’ కేటగిరీ

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:11 AM

తక్కువ టికెట్‌ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ఎకానమీ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్‌ ఫేర్‌’ కేటగిరీని ప్రవేశపెట్టినట్టు ఎయిర్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా...

ఎయిర్‌ ఇండియాలో ‘బేసిక్‌ ఫేర్‌’ కేటగిరీ

న్యూఢిల్లీ: తక్కువ టికెట్‌ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ఎకానమీ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్‌ ఫేర్‌’ కేటగిరీని ప్రవేశపెట్టినట్టు ఎయిర్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులకు ఉచిత ఆహారం అందించరు. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో దీన్ని ప్రవేశపెట్టామని, ఇది పూర్తిగా ఐచ్ఛికమని విమానయాన సంస్థ పేర్కొంది. ప్రయాణికులు అవసరం అనుకుంటే ఉచిత ఆహారం అందించే వాల్యూ, క్లాసిక్‌, ఫ్లెక్స్‌ కేటగిరీలను ఎంచుకోవచ్చని తెలిపింది. బేసిక్‌ ఫేర్‌ కేటగిరీలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు 15 కిలోల చెక్డ్‌ బ్యాగేజ్‌, 7 కిలోల క్యాబిన్‌ బ్యాగేజ్‌ అనుమతితో పాటు టీ లేదా కాఫీని ఉచితంగా అందిస్తారు. కానీ ఉచిత ఆహారం ఉండదు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన బేసిక్‌ ఫేర్‌ ఆప్షన్‌కు కస్టమర్ల నుంచి లభించే స్పందనను బట్టి కొనసాగించాలా వద్దా అనే దానిపై సంస్థ నిర్ణయం తీసుకోనుంది. బేసిక్‌ ఫేర్‌ను ఎంచుకున్నప్పటికీ ఒకవేళ ప్రయాణికులు తమకు ఆహారం కావాలనుకుంటే విమా నం బయలుదేరడానికి 24 గంటల ముందే వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌, జైన్‌, డయాబెటిక్‌ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:11 AM