Share News

చిప్స్ , డేటా సెంటర్లకూ ఏఐ విస్తరించాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:33 AM

భారత కృత్రిమ మేధ (ఏఐ).. ఎల్‌ఎల్‌ఎంలకే పరిమితం కాకూడని హైదరాబాద్‌లో భారత-అమెరికా వాణిజ్య మండలి (ఐఏసీసీ) నిర్వహించిన ‘డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సు, 2026’ పిలుపు ఇచ్చింది

చిప్స్ , డేటా సెంటర్లకూ ఏఐ విస్తరించాలి
Iacc

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత కృత్రిమ మేధ (ఏఐ).. ఎల్‌ఎల్‌ఎంలకే పరిమితం కాకూడని హైదరాబాద్‌లో భారత-అమెరికా వాణిజ్య మండలి (ఐఏసీసీ) నిర్వహించిన ‘డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సు, 2026’ పిలుపు ఇచ్చింది. చిప్స్‌, డేటా కేంద్రాల ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని కోరింది. ఏఐ డిమాండ్‌, జీసీసీల విస్తరణ, సైబర్‌ రిజిలియెన్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, క్లౌడ్‌ ఇన్నొవేషన్‌ రంగాల్లోనూ భారత ఏఐ కంపెనీలకు విస్తృత అవకాశాలు ఉన్నట్టు సదస్సులో ప్రసంగించిన నిపుణులు తెలిపారు. ఈ సదస్సులో ఐఏసీసీ (ఏపీ, తెలంగాణ) చైర్‌పర్సన్‌ శ్రీదేవి దేవిరెడ్డి, ఫీనిక్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ బాడిగ సహా వ్యాపార, పారిశ్రామిక, ప్రభుత్వ, టెక్నాలజీ రంగాలకు చెందిన దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 02:34 AM