ఏఐ వల్లే ఐటీలో హైరింగ్ తగ్గింది..
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:56 AM
దేశీయ యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించకలేకపోవడం ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. భారీగా ఉద్యోగావకాశాలు...
జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
న్యూఢిల్లీ: దేశీయ యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించకలేకపోవడం ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే ఐటీ రంగంలోనూ నియామకాలు మందగించాయని.. టెక్ కంపెనీలు తమ నిధులను కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్ మౌలిక వసతుల వైపు మళ్లిస్తుండటం ఇందుకు కారణమని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొత్త ఉద్యోగులకు చేరాల్సిన సొమ్ము ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లలోకి వెళుతోందన్నారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల తరహాలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించకపోయినప్పటికీ, గడచిన కొన్నేళ్లలో జోహో సహా దేశీయ ఐటీ ఇండస్ట్రీ పెద్దఎత్తున ఉద్యోగాలను కల్పించలేక పోయాయని వెంబు పేర్కొన్నారు. ఆయన ప్రస్తావించిన మరిన్ని విషయాలు..
సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్‌లో ఏఐతో ఉత్పాదకత మరింత పెరిగింది. కానీ, ప్రపంచ మార్కెట్‌కు మరింత సాఫ్ట్‌వేర్ అవసరమా అన్నదే నా ప్రశ్న.
సాఫ్ట్‌వేర్ కూడా కమోడిటీలా మారుతోంది. దాంతో సాఫ్ట్‌వేర్ కంపెనీల మధ్య పోటీ శరవేగ విస్తరణ నుంచి నాణ్యత, విశ్వసనీయత, బ్రాండ్ వేల్యూ వం టి అంశాల వైపు మళ్లుతోంది. దాంతో ఐటీ ఇండస్ట్రీలో వృద్ధి మరింత మందగించనుంది.
ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు తమ ఐటీ వ్యయ బడ్జెట్‌ను కూడా ఏఐ టెక్నాలజీ కోసం మళ్లిస్తున్నారు. ఏఐ కంపెనీలు భారీగా అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ, వాటికి అందుకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయా..? అన్న విషయంపై స్పష్టత లేదు.
మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ యాంత్రీకరణ కారణంగా కార్మికులకు ఉద్యోగావకాశాలు తగ్గాయి. యాంత్రీకరణ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించినప్పటికీ.. కార్మికులకు ఉద్యోగ, ఆదాయ అవకాశాలను తగ్గిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికే ఉచితాల రూపంలో ప్రజలకు ఎంతో కొంత అందజేస్తూనే ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..