Share News

అణు విద్యుత్‌పై అదానీ ఫోకస్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:42 AM

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2035నాటికి ...

అణు విద్యుత్‌పై అదానీ ఫోకస్‌

2035 నాటికి 10 గిగావాట్ల సామర్థ్య లక్ష్యం

న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2035నాటికి 10 గిగావాట్ల అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని నిర్మించాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం ప్రకటించారు. గ్రూప్‌ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. అదానీ అటామిక్‌ ఎనర్జీ పేరిట న్యూక్లియర్‌ వెంచర్‌ కోసం ఇప్పటికే భూమిని గుర్తించినట్టు చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి తమ గ్రూప్‌ వ్యూహంలో ఈ వెంచర్‌ భాగమన్నారు.

ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jun 25 , 2026 | 05:42 AM