Share News

అదానీ చేతికి జైప్రకాశ్‌ అసోసియేట్స్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:01 AM

దివాలా ప్రక్రియలో ఉన్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జేఎఎల్‌) పరిష్కార ప్రక్రి య కథ సుఖాంతమైంది. ఈ కంపెనీని రూ.14,535 కోట్లకు టేకోవర్‌ చేసేందుకు....

అదానీ చేతికి జైప్రకాశ్‌ అసోసియేట్స్‌

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జేఎఎల్‌) పరిష్కార ప్రక్రి య కథ సుఖాంతమైంది. ఈ కంపెనీని రూ.14,535 కోట్లకు టేకోవర్‌ చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) వేసిన బిడ్‌కు అలహాబాద్‌లోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఆమోదం తెలిపింది. రూ.57,185 కోట్ల రుణ బకాయిలు చెల్లించలేక పోవడంతో గత ఏడాది జూన్‌లో రుణదాతలు జేఏఎల్‌పై దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. సిమెంట్‌, మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌, హాస్పిటాలిటీ వ్యాపారాల్లో ఉన్న జేఏఎల్‌ ఆస్తుల కోసం అదానీ గ్రూప్‌తో పాటు వేదాంత, దాల్మియా భారత్‌ గ్రూప్‌ కూడా పోటీపడ్డాయి.

ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 02:01 AM