Share News

పెద్దాపుట్టులో దాహం కేకలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:25 PM

మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ పెద్దాపుట్టులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

పెద్దాపుట్టులో దాహం కేకలు
సుదూర ప్రాంతం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న మహిళలు

మూలకు చేరిన నీటి పథకాలు

సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవలసిన దుస్థితి

ముంచంగిపుట్టు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ పెద్దాపుట్టులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెద్దాపుట్టులో సుమారు 14 కుటుంబాల గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారి దాహార్తిని తీర్చేందుకు అధికారులు గతంలో రెండు నీటి పథకాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ నీటి పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామానికి చెందిన కామేశ్వరరావు, సూరి, చందరావు, సొన్ను తదితరులు తెలిపారు. దీంతో సుదూర ప్రాంతంలో ఉన్న మంచినీటి బోరు నుంచి నీరు తెచ్చుకుంటున్నామని స్థానిక మహిళలు తెలిపారు. అధికారులు స్పందించి తమ నీటి కష్టాలు తొలగించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:26 PM