మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:26 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై ఇవాళ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్, మార్చి 16: ఇవాళ(సోమవారం) సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నిందితులకు అందజేశామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో నిందితుల తరఫు లాయర్లకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ నుంచి కేసు వివరాలు అందినట్లు అఫిడవిట్ ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ నెల 19వ తేదీ లోపు అఫిడవిట్‌ను సమర్పించాలని స్పష్టం చేసింది. కేసులో తదుపరి న్యాయ ప్రక్రియలు కొనసాగేందుకు అవసరమైన పత్రాలను సమయానికి దాఖలు చేయాలని కూడా కోర్టు సూచించింది. నిందితుల నుంచి అఫిడవిట్లు వచ్చిన అనంతరం తదుపరి దశలో విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను బుధవారానికి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. దీంతో వివేకా హత్య కేసు విచారణలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు వివేక హత్య కేసుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'వివేకా కేసులో సునీత పోరాటం న్యాయం కోసమేనా?. ఆమె ప్రతిసారి కోర్టుకు వెళ్తూ దర్యాప్తును అడ్డుకుంటున్నారు. మేము నిర్దోషులం అని నిరూపించుకుంటాం. సీబీఐ, కోర్టును విమర్శించేలా సునీత మాట్లాడారు. గుండెపోటు స్టోరీ పుట్టించిందే సునీతా రెడ్డి. వివేకా వేరే సంబంధాల గురించి దస్తగిరి చెప్పినా... ఆ కోణంలో దర్యాప్తు చేయడం లేదు' అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం
జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్