Share News

తుఫాన్‌ సమస్యల పరిష్కారానికి ‘మనమిత్ర’

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:15 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా నేరుగా అధికారులకు తెలియజేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

తుఫాన్‌ సమస్యల పరిష్కారానికి ‘మనమిత్ర’

  • అందుబాటులోకి వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు

  • చెట్లు కూలినా, విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిచినా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం

  • ప్రభావిత ప్రజలు వినియోగించుకోవాలి: ఆర్టీజీఎస్‌

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా నేరుగా అధికారులకు తెలియజేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తుఫాన్‌ ప్రభావంతో చెట్లు కూలినా, విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా, తాగునీటి సరఫరా ఆగిపోయినా ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా.. పౌరులు తమ మొబైల్‌ ఫోన్లలో మనమిత్ర ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది. దీంతో సమస్యను పరిష్కరించేలా, తుఫాన్‌ బాధితులకు తక్షణ సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ సోమవారం తెలిపింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలంతా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీజీఎస్‌ అధికారులు కోరారు.

ఎలా ఉపయోగించుకోవాలంటే..

  • మొబైల్‌ ఫోన్‌ నుంచి 9552300009 మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ నెంబరుకు ‘హాయ్‌’ అని మెసేజ్‌ చేయాలి.

  • తదుపరి సేవల ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

  • ఆ తర్వాత ‘ఆర్నబ్‌ సైక్లోన్‌ ఇష్యూస్‌’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

  • అనంతరం రిపోర్ట్‌ ఇష్యూని ఎంపిక చేసుకుని, కన్ఫర్మ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

  • రిజిస్ర్టేషన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

  • తర్వాత మీ పేరు, జిల్లా, మండలం నమోదు చేసి, మీ ప్రాంతంలో తుఫాన్‌ కారణంగా ఎదురవుతున్న సమస్యను నమోదు చేయాలి.

  • ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు.

  • దీంతో ఆ సమస్యను ఆ ప్రాంతంలోని సంబంధిత అధికారికి పంపి, వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 06:15 AM