Share News

వాడివేడిగా జడ్పీ సమావేశం

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:25 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సమస్యలపై ప్రధానంగా చర్చించారు.

వాడివేడిగా జడ్పీ సమావేశం
జడ్పీ సమావేశానికి హాజరైన సభ్యులు

సమస్యలపై సభ్యుల పట్టు.. కొంతమంది వాకౌట్‌

2026–27 బడ్జెట్‌కు ఆమోదం

ఏలూరుసిటీ, మార్చి 22( ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సమస్యలపై ప్రధానంగా చర్చించారు. మా హక్కులపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, ఎజెండా పంపించకుండా బడ్జెట్‌పై ఎలా చర్చిస్తారని పోడూరు జడ్పీటీసీ సభ్యుడు పెద్దిరాజు ప్రశ్నించారు. ఈ విషయంపై వైసీపీ జడ్పీటీసీ సభ్యులకు జడ్పీ చైర్‌పర్సన్‌ మధ్య కొంత సేపు వాదన జరిగింది. అధికారులతో సమీక్ష జరుగుతున్న సమయంలో జడ్పీటీసీ సభ్యులకు మధ్యలో మాట్లాడే అవకాశం ఉండదని, అధికారుల సమీక్ష తర్వాత జడ్పీటీసీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ ఉద్ఘాటించారు. ఈ విసయంపై తాము ఇప్పుడే మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు పెద్దిరాజు పట్టుబట్టారు. అనంతరం పలువురు జడ్పీటీసీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. సమావేశంలో 2026–27 జడ్పీ బడ్జెట్‌ను ఆమోదించటం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కొంతమంది జడ్పీటీసీ సభ్యులు, అధికారులు కూడా హాజరుకాలేదు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ మాత్రం ఈ సమావేశానికి హాజరై పలు సమస్యలను ప్రస్తావించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులు 557 ఉండగా వాటిలో 194 ట్యాంకులలో 75 నుంచి 95 శాతం వరకు, 280 చెరువుల్లో 50 నుంచి 70శాతం వరకు నీటిని నింపటం జరిగిందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రానున్న వేసవిలో తాగునీటికి ఎద్దడి రాకుండా సంబంధిత శాఖల అఽధికారులందరూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టవలసిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేసే లోగా మంచినీటి చెరువులను నింపుకునేలా పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వంట గ్యాస్‌ సరఫరాకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల ప్రొటోకాల్‌ ను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

వంట గ్యాస్‌ కొరత లేదు: జేసీ

ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంజె అభిషేక గౌడ మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరాలో ఎటువంటి కొరత లేదన్నారు. జిల్లాలో పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఈ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరాకు 5వేలు కనెక్షన్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలకు కూడా ఎటువంటి కొరతా లేకుండా వంటగ్యాస్‌ సరఫరా చేస్తు న్నామన్నా రు. వాణిజ్య అవసరాల కు కూడా 10 నుంచి 20 శాతం మేర అదనంగా గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఫ జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ జుత్తిక నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయ సెస్‌గా 9కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని గ్రంథాలయ సంస్థకు జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతు సేవా కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేక వినియోగం లోకి రాలేదని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్ప త్రిలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడు తున్నారని తెలిపారు.

జడ్పీ బడ్జెట్‌కు ఆమోదం

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి రూ.14.07 కోట్లతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ బడ్జెట్‌ ప్రతిపా దనలను ఈ సమావేశంలో ఆమోదించారు. 2026–27 సంవత్సరానికి జిల్లా పరిషత్‌ బడ్జె ట్‌ సాధారణ ఆదాయ అంచనాలు 14 కోట్ల 7లక్షల 80వేల రూపాయలు కాగా, 2025–26 ఆర్థిక సంత్సరానికి గాను 12కోట్ల 23 లక్షల 80వేల రూపాయలతో సవరించిన బడ్జెట్‌ను ఈ సమావేశం ఆమోదించింది.

Updated Date - Mar 23 , 2026 | 12:25 AM