Share News

జడ్పీ రేసులో..

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:00 AM

ఏలూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని ఓసీ మహి ళకు రిజర్వేషన్‌ ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్‌ ప్రకటించింది. దీంతో కూటమి పార్టీల్లో కీలకనేతలు తమ బంధుగణాన్ని బరిలో దిం పేందుకు పావులు కదుపుతున్నారు.

జడ్పీ రేసులో..

టీడీపీ నుంచి చింతమనేని తనయ నవ్యశ్రీ.. మాగంటి బాబు సతీమణి వల్లీ పద్మావతి

బీజేపీ నుంచి శరణాల మాలతీరాణి

జనసేన నుంచి కొఠారు లక్ష్మి

ఏలూరు,అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని ఓసీ మహి ళకు రిజర్వేషన్‌ ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్‌ ప్రకటించింది. దీంతో కూటమి పార్టీల్లో కీలకనేతలు తమ బంధుగణాన్ని బరిలో దిం పేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ నుంచి దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పెద్ద కుమార్తె వంకినేని నవ్యశ్రీని బరిలో దింపే యోచనలో ఉన్నారు. పెదవేగి జడ్పీ టీసీ ఓసీ మహిళకు రిజర్వ్‌ అయ్యిందని, చంద్రబాబు ఆదేశిస్తే తన కుమార్తెను బరిలో దింపే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. సుదీర్ఘ రాజకీయాలతో తనకుంటూ ఒక గుర్తింపు పొందిన మాజీ ఎంపీ మాగంటి బాబు తన సతీమణి వల్లీ పద్మావతిని బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకురాలిగా ఉన్న శరణాల మాలతీరాణి చైర్‌పర్సన్‌గా బరి లోకి నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించాలని ఆమె అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ముగ్గురూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. దెందులూరు నుంచి జనసేన నాయ కుడు కొఠారు ఆదిశేషు భార్య లక్ష్మి బరిలో ఉన్నట్టు సమా చారం.

వైసీపీ నుంచి పలువురిపై ఆరా

దెందులూరుకు చెందిన కీలక నేత బీవీఆర్‌కే చౌదరి సతీ మణి, సీనియర్‌ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్‌ సతీమణి, ధర్మాజీగూడెంకు చెందిన మందలపు రవి సతీమణి, టి.నర్సా పురం నుంచి మాజీ జడ్పీటీసీ సామంతపూడి సూరిబాబు సతీమణి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కోడల్ని పేర్లను వైసీపీ అధిష్ఠానం పరిశీలించింది.

Updated Date - Oct 14 , 2026 | 12:00 AM