హోరెత్తించారు!
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:23 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామి నేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీగా నామినేషన్లు
జడ్పీటీసీలకు 224.. ఎంపీటీసీలకు 2,423
ముగిసిన నామినేషన్ల పర్వం
కోలాహలంగా ఏలూరు జడ్పీ కార్యాలయం
జోరున వర్షం కురుస్తున్నా తగ్గని సందడి
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి):
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామి నేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 27 జడ్పీటీసీలు, 454 ఎంపీటీసీలు ఉండగా చివరి రోజున జడ్పీటీసీలకు 138 నామినేషన్లు దాఖలయ్యాయి. గత మూడు రోజుల్లో జడ్పీటీసీలకు మొత్తంగా 224 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచే జడ్పీటీసీ నామినేషన్ల హడావుడి మొద లైంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ పెదవేగి జడ్పీటీసీ స్థానానికి భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జోరున వర్షం కురిసింది. ఆ వర్షంలోనే మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) సతీమణి మాగంటి పద్మవల్లీదేవి కామవరపుకోట జడ్పీ స్థానానికి భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్ వేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూటమి పార్టీలకు చెందిన వారు, ప్రతిపక్ష వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన వారు నామినేషన్లు వేశారు. ఉదయం నుంచి జడ్పీ కార్యా లయం కోలాహలంగా కనిపించింది. ఎక్కడ చూసినా జడ్పీటీసీలకు పోటీచేసే వివిధ పార్టీలకు చెందిన అభ్య ర్థులే కనిపించారు. సాయంత్రం ఐదు గంటల సమ యానికి నామినేషన్ కేంద్రం లోపల ఉన్నవారందరి నామినేషన్లు తీసుకోవాల్సి ఉండటంతో రాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. జడ్పీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల పర్వం కొనసాగింది. నామి నేషన్లు స్వీకరించే ముందు నామినేషన్లు పరిశీలించుకో వడానికి జడ్పీ కార్యాలయ ఆవరణలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ నామినేషన్లు పరిశీలనకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఎస్‌డిసి, డీఎల్‌డీవో అధి కారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. జడ్పీటీసీ ఎన్నికలకు సంబంఽధించి రిటర్నింగ్ అధికారి,జేసీ అభి షేకగౌడ అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలను స్వీకరించారు. జడ్పీ సీఈవో కృష్ణమోహన్, డిప్యూటీ సీఈవో భీమేశ్వర్ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జడ్పీటీసీల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, పెదవేగి జడ్పీటీసీ అఽభ్యర్థినిగా తన కుమార్తె సాయి నవ్యశ్రీ నామినేషన్ దాఖలు చేసిందని, ఆమె అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమి అధిష్ఠానం తీసు కునే నిర్ణయమే మాకు శిరోధార్యమన్నారు.
మాగంటి పద్మవల్లీ దేవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌కు తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈసారి తన సతీమణి పద్మవల్లీదేవి కామవరపుకోట జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారని, ప్రజా ఆశీస్సులతో జడ్పీ టీసీగా ఆమె విజయం తథ్యమన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ గా అవకాశం కల్పిస్తే జిల్లా పరిషత్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.
జడ్పీటీసీలకు 224 ..
జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు మూడు రోజులలో 224 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా నామినేషన్ల వివరాలు.. ఆగిరిపల్లికి 7, భీమడోలు 7, బుట్టాయిగూడెం 8, చాట్రాయి 11, చింతలపూడి 10, ద్వారకాతిరుమల 7, దెందులూరు 13, ఏలూరు 10, జంగారెడ్డిగూడెం 8, జీలుగుమిల్లి 4, కైకలూరు 11, కలిదిండి 9, కామవరపుకోట 12, కొయ్యలగూడెం 7, లింగపాలెం 9, మండవల్లి 10, ముదినేపల్లి 13, ముసునూరు 8, నిడమర్రు 3, నూజివీడు 8, పెదపాడు 11, పెదవేగి 5, పోలవరం 5, టి.నర్సాపురం 7, ఉంగుటూరు 9, వేలేరుపాడుకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా దెందులూరు జడ్పీటీసీ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా నిడమర్రుకు 3 దాఖలయ్యాయి. పార్టీల వారీగా టీడీపీ తరపున 67, వైసీపీ 74, జనసేన 36, బీజేపీ 10, కాంగ్రెస్ 20, బీఎస్పీ 4, సీపీఐఎం 2, సీపీఐఎంఎల్ 2, ఇతర పార్టీలు 3, ఇండిపెండెట్లుగా ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎంపీటీసీలకు 2,423
ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 454 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 2,423 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 1045 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా టీడీపీ తరపున 842 మంది, వైసీపీ 1,084, జనసేన 291, బీజేపీ 46, కాంగ్రెస్ 41, సీపీఐఎం తరపున 21 మంది, బీఎస్పీ తరపున 2, ఇతర పార్టీల తరపున 14, ఇండిపెండెంట్లు 82 మంది నామినేషన్లు దాఖలు చేశారు.