జడ్పీ సీఈవోగా కృష్ణమోహన్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:56 PM
ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా ఎం.కృష్ణమోహన్ మంగళవారం జడ్పీ కార్యా లయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఏలూరు సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యో తి): ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా ఎం.కృష్ణమోహన్ మంగళవారం జడ్పీ కార్యా లయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి సీఈవోగా డీపీవో జీవీకే మల్లికార్జునరావు పనిచేశారు. రాష్ట్ర వైద్యశాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న కృష్ణమోహన్‌ను ప్రభు త్వం ఏలూరు జిల్లా జడ్పీ సీఈవోగా నియ మించింది. కాగా ఆయన కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. జడ్పీ కార్యా లయంలో కృష్ణమోహన్‌ను డిప్యూటీ సీఈవో కె.భీమేశ్వర్, ఏవోలు, సీనియర్ అసిస్టెంట్లు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.