Share News

పశ్చిమ జడ్పీ సిద్ధం

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:53 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ మూడు జడ్పీలుగా మారింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కొంత భాగం తూర్పు గోదావరిలోకి వెళ్లడం తో ఇవి ఏర్పాటు కానున్నాయి.

పశ్చిమ జడ్పీ సిద్ధం
భీమవరం పంచాయతీరాజ్‌ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న జడ్పీ అధికారులు

25 నుంచి భీమవరం కేంద్రంగా పాలన

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ భవనంలో తాత్కాలిక కార్యాలయం

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

మొదలైన ఉద్యోగుల విభజన ప్రక్రియ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ మూడు జడ్పీలుగా మారింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కొంత భాగం తూర్పు గోదావరిలోకి వెళ్లడం తో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 24తో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. 25వ తేదీ నుంచి ఏలూరు జడ్పీ, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదా వరి జడ్పీ ఏర్పడి పాలన కొనసాగాయి. ఇక కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజవర్గాల్లోని తొమ్మిది మండలాలు తూర్పు గోదావరి జడ్పీలోకి వెళతాయి. ఏలూరు జడ్పీ ఉమ్మడి కృష్ణాలోని ఎనిమిది విలీన మండలాలతో కలిపి 27, పశ్చిమ జడ్పీ 20 మండలాలు ఏర్పడనున్నాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి పశ్చిమ జడ్పీలో 119 పోస్టులు ఉండగా ఉద్యోగుల సంఖ్య 99. వీరిలో జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు పది మంది ఏవోలు, 25 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు యూడీ స్టెనోలు, 44 మంది జూని యర్‌ అసిస్టెంట్లు, ఒక ఎల్‌డీ స్టెనో, ఎనిమిది మంది టైపిస్టులు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ముగ్గురు డ్రైవర్లు, 22 మంది ఆఫీస్‌ సబార్డినేట్స్‌ కలిపి మొత్తం 99 మంది పనిచేస్తున్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏలూరు జడ్పీ నుంచి 60 శాతం మంది ఉద్యోగులు, పశ్చిమ, తూర్పు గోదావరిలకు వెళ్లనున్నారు. కృష్ణా నుంచి ఏలూ రు జడ్పీకి పది శాతం మంది రానున్నారు. జడ్పీల పరిధి తగ్గడంతో 50 శాతం మంది ఉద్యోగులు వారి ప్రాంతీ యత ఆధారంగా మిగిలిన జడ్పీలకు వెళ్లే అవకాశాలు న్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన పశ్చిమకు కొందరిని పంపిం చనున్నారు.

25 నుంచి కార్యకలాపాలు

భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ పరిపాలన కార్యకలాపాలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సిబ్బంది విధుల్లో చేరేలా యం త్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాత బస్టాండ్‌ సమీ పంలోని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయ భవనం లో ఒక అంతస్తును తాత్కాలికంగా జడ్పీ కార్యాలయం కోసం కేటాయించారు. ఈ భవన సముదాయాన్ని శుక్రవారం ఏలూరు జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో భీమేశ్వర్‌ బృందం పరిశీలించింది. అందులోని సువిశాల హాల్‌ను తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల ని నిర్ణయించారు. ప్రస్తుతం గుర్తించిన భవనం కేవలం ఉద్యోగుల విధులకు మాత్రమే పరిమితం కానుంది. భవిష్య త్తులో జడ్పీ పాలకవర్గం కొలువుదీరితే సమావేశ మంది రంతోపాటు చైర్మన్‌, సీఈవో, డిప్యూటీ సీఈవోలకు ప్రత్యేక చాంబర్లు, అకౌంట్స్‌, పరిపాలనా విభాగాలకు విశాలమైన స్థలం అవసరం ఉంటుంది. అందువల్ల పాలకవర్గ ఏర్పాటు నాటికి మరో పెద్ద భవన సముదాయాన్ని అద్దెకు తీసుకోవా లని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శాశ్వత భవన నిర్మాణానికి కనీసం రెండు ఎకరాల భూమి అవసరమని, నిధులకు కొరత లేనప్పటికీ నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్ల గడువు పడు తుందని అంచనా వేస్తున్నారు. శాశ్వత భవనం సిద్ధమయ్యే వరకు తాత్కాలిక ప్రాంగణాల్లోనే జిల్లా పరిషత్‌ కార్యకలా పాలు సాగనున్నాయి.

Updated Date - Sep 19 , 2026 | 12:53 AM