జడ్పీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:59 PM
పశ్చిమ గోదావరి జిల్లా పరి షత్ చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? చైర్మన్ అభ్యర్థి ఎవరు? అనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
అధిష్ఠానం నిర్ణయంపైనే ఉత్కంఠ!
రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
టీడీపీ నుంచి ఇందుకూరి, జనసేన నుంచి పీవీఎల్ పోటీ
భీమవరం జడ్పీ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ..
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమ గోదావరి జిల్లా పరి షత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 20న నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలూ కూటమికే దక్కడంతో ఎన్నిక పూర్తిగా ఏకపక్షం కానుంది. అయితే, జడ్పీ పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? చైర్మన్ అభ్యర్థి ఎవరు? అనే అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి అధిష్ఠానం నిర్ణయం కోసం నేతలం తా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టీడీపీ, జనసేన మధ్య ఆసక్తికర పోటీ
జడ్పీ చైర్మన్ పీఠం కోసం కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీల్లో ఆశావహులు బలంగా ఉన్నారు. టీడీపీ నుంచి గణపవరం జడ్పీటీసీ ఇందుకూరి రామకృష్ణంరాజు, జనసేన నుంచి ఉండి జడ్పీ టీసీ పీవీఎల్ నరసింహరాజు పోటీ పడుతున్నారు. ఈ పీఠాన్ని ఏ పార్టీకి కేటాయించాలి, చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై కూటమి అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లా ప్రజా ప్రతి నిధులు, కూటమి నేతల అభిప్రాయాలను తెలుసుకుని చైర్మన్ పేరును ఖరారు చేస్తారు. చైర్మన్ అభ్యర్థి తేలిన తర్వాతే వైస్ చైర్మన్ ఎవరనేది నిర్ణయిస్తారు. మొత్తం 20 మంది జడ్పీటీసీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మ న్‌తోపాటు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. భీమవరం పాతబస్టాండ్ వద్ద ఉన్న జడ్పీ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరగ నుంది. కో ఆప్షన్ సభ్యుల నామినేషన్లను జిల్లా కలెక్టర్ స్వీకరిస్తారు.
సర్పంచ్‌కు 77.. వార్డులకు 243
రెండవ విడత పంచాయతీల్లో నామినేషన్లు
తాడేపల్లిగూడెం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామి నేషన్ పర్వం మొదలైంది. తాడేపల్లిగూడెం డివిజన్‌లో ఐదు మండలాలకు, భీమ వరం డివిజన్‌లో ఒక మండలానికి ఈ నెల 29 పోలింగ్ జరగనుంది. తొలిరోజు బుధవారం నవమి కావడంతో నామినేషన్లు మందకొడిగానే సాగాయి. గురువారం దశమి, శుక్రవారం ఏకాదశికి చాలా మంది వాయిదా వేసుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల పరిశీలన జరిగింది.