Share News

ఆరోగ్య యోగం

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:33 AM

యోగా ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అన్నారు.

ఆరోగ్య యోగం
ఏలూరులో యోగాసనాలు వేస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ, ఎమ్మెల్యే బడేటి చంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాలు

పెదపాడు/పెదవేగి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): యోగా ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని టెక్నికల్‌ ట్రైనింగ్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ (టీటీడీసీ)లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వ హించారు. 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా యోగాభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్‌ కలెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే బడేటి చంటి, ఎస్పీ కేపీఎస్‌.కిశోర్‌, జేసీ ఎంజే.అభిషేక్‌ గౌడ, ఏపీఎస్‌ ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు కలెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు యోగాసనాలు వేశారు.

పెదవేగిలోని పోలీస్‌ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో యోగ గురువు వేముల ధర్మారావు బృందం ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026 కార్యక్రమం నిర్వహిం చారు. ఎస్పీ కేపీఎస్‌.కిశోర్‌ మాట్లాడుతూ ఆరోగ్యానికి యోగా మార్గదర్శి గా ఉంటుందన్నారు. క్రమశిక్షణ, సహనం, మానసిక స్థైర్యం యోగాతో సాధ్యపడుతుందన్నారు. డీటీసీలోని 136మంది ట్రైనింగ్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది కార్యక్రమంలో యోగాసనాలు వేశారు.

జిల్లా అటవీ శాఖాధికారి పీవీ.సందీప్‌రెడ్డి, జడ్పీ సీఈవో జగదాంబ, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఆయుష్‌ రీజనల్‌ డీడీ కృష్ణవేణి, ఇడా చైర్మన్‌ పెద్దిబోయిన వాణి శివ ప్రసాద్‌, డీటీసీ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐలు ఆకుల రఘు, గంగాధర్‌, రామారావు, ఎస్‌ఐ ఎం.హరిగోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:33 AM