యోగా.. అద్భుతమైన జీవన విధానం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:53 AM
యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది భారతీయ సనాతన సంప్రదాయం ప్రపం చానికి అందించిన ఒక అద్భుతమైన జీవన విధానం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
భీమవరంటౌన్ జూన్ 20 (ఆంరఽధజోతి) : యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది భారతీయ సనాతన సంప్రదాయం ప్రపం చానికి అందించిన ఒక అద్భుతమైన జీవన విధానం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశా లలో శనివారం విద్యార్థులతో భారీఎత్తున ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు