వైసీపీకి షాక్..!
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:57 AM
అక్షరంపై అక్కసు వెల్లగక్కేందుకు వైసీపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెడిసికొట్టాయి.
వైసీపీకి షాక్..!
అధిష్టానం పిలుపును పట్టించుకోని శ్రేణులు
ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి, ధర్నా విఫలం
(ఏలూరు/భీమవరం/తణుకు రూరల్–ఆంధ్రజ్యోతి):
అక్షరంపై అక్కసు వెల్లగక్కేందుకు వైసీపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెడిసికొట్టాయి. రాష్ర్టానికి అమరావతి రాజధానిగానే ఉండాలని ప్రజల ఆకాం క్షలకు విలువనిస్తూ వివిధ కథనాలను ప్రచురించి, ప్రసారం చేసిన ఏబీఎన్– ఆంరఽధజ్యోతిపై విషం, బురద చల్లాలని ఆ పార్టీ అధిష్టానం పలు ఆందోళన లకు మంగళ, బుధవారాల్లో పిలుపునిచ్చింది. వైసీపీలోనే సామాన్య కార్యకర్త సైతం దీనికి స్పందించకపోవడం వారికి మింగుడు పడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అలంపురంలోని యూనిట్ కార్యాలయం వద్దకు, ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్దకు వెళ్లాలని ఆదేశిం చింది. ఇందుకు మహిళలను పెద్ద ఎత్తున సమీకరించాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది. కాని, పార్టీ శ్రేణులు ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ఎక్కువ మంది పెళ్లిళ్లు, పరామర్శలు, వ్యక్తిగత పనుల్లో బిజీబిజీగా కనిపిం చారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ ముఖ్యులు తణుకు విచ్చేశారు. పనిలో పనిగా వీరితోనే కాసేపు పట్టణంలోని నరేంద్ర సెంటర్‌లో ఏబీ ఎన్–ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ ధర్నా చేశారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను చించివేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, భీమవరం ఇన్‌చార్జి చినిమిల్లి వెంకట్రాయుడు, గుడాల గోపీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏలూరులో మంగళవారం పార్టీ జిల్లాస్థాయి సమావేశం జరిగినప్పటికి ఈ ఆందోళనలపై పెద్దగా కేడర్, నేతలు స్పందించలేదు. ఎక్కడ ఆందోళన చేస్తే.. తమకు ఉన్న పరువు కూడా గంగపాల వుతుందని.. మైలేజి రాదనే ధొరణితోనే అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. మావిగన్ అనే పేరును ఎవరు ప్రతిపాదించారో.. అంటూ నేతలే విస్తుపోయారు. మొత్తగా నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లకే పరిమితం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దాడులు అప్రజాస్వామికం
– ఏంఏ షరీఫ్, మైనార్టీ సలహాదారుడు
ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి అప్రజాస్వామికం. అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదు. రాష్ర్టానికి రాఽజధాని ఏర్పడి అందరూ సంతోషిస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీ శ్రేణులు ఇటువంటి పనులకు పాల్పడుతున్నాయి.
ఆంధ్రజ్యోతిపై దాడి హేయమైన చర్య
– మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి.
ఏబీఎన్– ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడడం హేయమైన చర్య. రాఽజధాని విషయంలో ప్రజలు ఐదేళ్లపాటు అయోమయంలో పడేసిన జగన్‌మోహన్ రెడ్డి అమరావతికి చట్టబద్ధత కల్పించిన సమయంలో రాజఽధానిపై కొత్త సన్నాయి నొక్కుళ్ళు నొక్కటం విడ్డూరంగా ఉంది.