Share News

సనాతన ధర్మంపై వైసీపీ దాడి

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:16 AM

సనాతన ధర్మంపై జగన్‌ దర్శకత్వంలో వైసీపీ శ్రేణులు ప్రణాళిక ప్రకారం కొంతకాలంగా దాడులు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు ధ్వజమెత్తారు.

సనాతన ధర్మంపై వైసీపీ దాడి
ప్లకార్డులతో టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామరాజు, గోవిందరావు, శ్రీదేవి

కూటమి నేతల ధ్వజం

భీవరంటౌన్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మంపై జగన్‌ దర్శకత్వంలో వైసీపీ శ్రేణులు ప్రణాళిక ప్రకారం కొంతకాలంగా దాడులు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాల యంలో టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మంతెన రామరాజు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామికి జరిగిన అపచారాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు భవిష్యత్‌లో మరే మతానికి ఇలా జరగ కుండా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి లేదని జగన్‌ చెప్పడం లేదని రామరాజు గుర్తు చేశారు. జగన్‌ తిరుపతి వెళితే డిక్లరేషన్‌ ఇవ్వరని, భగవంతునికి గౌరవం ఇస్తే మీకు గౌరవం పెరుగుతుందన్నారు.

కులం.. మతం పేరిట విధ్వంసం : గోవిందరావు

మతం, కులం పేరుతో విధ్వంసాలు సృష్టించకూడదని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) అన్నారు. హిందూ ధర్మంపై వైసీపీ జగన్‌ దర్శకత్వంలో కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 300పైగా హిందూ ఆలయాలపై దాడులు, రఽథాలు తగలబెట్టిన జగన్‌ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణి చోరీ, లడ్డూ ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగంతో మహాపచారం చేశారని, ఇప్పుడు ఏకంగా వేంకటేశ్వరస్వామినే రాజకీయాల్లోకి తీసుకువచ్చారన్నారు. మండలిలో వైసీపీ ప్రజా ప్రతి నిధులు చెప్పులు, బూట్లు ధరించి స్వామివారి చిత్రపటాన్ని గాల్లోకి ఊపుతూ అవహేళన చేస్తూ తరువాత పక్కకు పడేయడం దారుణమని మండిపడ్డారు.

దేవుడితో రాజకీయం చేస్తున్నారు : శ్రీదేవి

దేవుడి చిత్రపటాలను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు రాజకీయం చేయడం వారి దిగజా రుడుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. జగన్‌ సూచనతో వారు వ్యవహరించిన తీరు బాధాకరమని, హిందూ మత విశ్వాసాలను కించ పరిస్తే ప్రజలు సహించరన్నారు. వైసీపీ పాలనలో టీటీడీలో అన్యమతస్తుల నియామకం, ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్‌ సైట్‌లో అన్యమత బోధన తిరుమల పవిత్రతను దెబ్బతీశాయన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:16 AM