Share News

ప్రకృతిని కాపాడుకుందాం

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:10 AM

పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి చైౖర్మన్‌, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.మీనా దేవి అన్నారు.

ప్రకృతిని కాపాడుకుందాం
మొక్కలు నాటుతున్న రెండో అదనపు జిల్లా జడ్జి మీనాదేవి

ఏలూరు క్రైం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి చైౖర్మన్‌, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.మీనా దేవి అన్నారు. ప్రపంచ పర్యా వరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తించి, కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి ఏటా జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ప్రకృతిని రక్షించడం ప్రభు త్వాల బాధ్యత మాత్రమే కాదని, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని చిన్న అలవాట్లతో ప్రకృతిని కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ప్రమీలరాణి, 4వ అదనపు జూనియర్‌ సవిల్‌ జడ్జి కె.స్పందన, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కోనే సీతారామ్‌, పీడీ ప్రసాద్‌, పుచ్చల వెంకటేశ్వరరావు, జీవి భాస్కర్‌, ఎస్‌వీ సుబ్రహ్మణ్యం, మోహనరావు, పాండురంగ విఠల్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:10 AM