Share News

ప్రకృతి విధ్వంసం

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:07 AM

మాఫియా చెలరేగిపోతోంది. ఓ వైపు అడవులను.. మరోవైపు కొండలు, గుట్టలను కొల్లగొట్టేస్తోంది. అధికార పెద్దల అండదండలతో ప్రకృతిని ధ్వంసం చేస్తోంది.

ప్రకృతి విధ్వంసం
యంత్రాలతో కలటూరు గట్టు తవ్వకాలు

అడవులను నరికేస్తాం.. కొండలను తవ్వేస్తాం

యథేచ్ఛగా కలప, గ్రావెల్‌ రవాణాతో చెలరేగిపోతున్న మాఫియా

మాఫియా చెలరేగిపోతోంది. ఓ వైపు అడవులను.. మరోవైపు కొండలు, గుట్టలను కొల్లగొట్టేస్తోంది. అధికార పెద్దల అండదండలతో ప్రకృతిని ధ్వంసం చేస్తోంది. కొందరు అధికారులు చూసినా.. మనకు ఎందుకులే అని కళ్లు మూసుకుంటున్నారు. అమరవరం అడవిలో భారీ వృక్షాలు, ఆగిరిపల్లిలో కొండలను కొల్లగొట్టి కోట్లు కూడబెడుతున్నారు.

అమరవరం రేంజ్‌లో అడవి ఆక్రందన

భారీ చెట్లు నరికివేత.. ఆపై ఆనవాళ్లు లేకుండా కాల్చివేత.. అధికారుల మౌనం

కుక్కునూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి):అడ వులు, వన్యప్రాణుల రక్షణ కోసం రూపొందించిన హనుమాన్‌ ప్రాజెక్టును ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల జీవనానికి భద్రత కల్పించేలా చర్య లు తీసుకోవడం దీని ఉద్దేశం. అయితే కుక్కు నూరు మండలం అమరవరం అటవీ రేంజ్‌ పరి ధిలో మాత్రం అడవుల విధ్వంసం అధికారులను కదిలించడం లేదు. కొన్నేళ్లుగా విచ్చలవిడిగా అడ వుల్లోని చెట్లను నరికివేస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ లోని భూములను ఆక్రమించి జామాయిల్‌ నర్సరీ లు ఏర్పాటు చేస్తున్నారు. వందలాది ఎకరాల అడవిని పోడు వ్యవసాయం పేరిట యథేచ్ఛగా నరికి వేస్తున్నారు.

ఒకప్పుడు అమరవరం అటవీ ప్రాంతాన్ని చూస్తే ఆనందం వెల్లివిరిసేది. భారీ వృక్షాలు, పక్షుల కిలకిల రావాలు, వన్య ప్రాణుల అడుగుల చప్పుడు వినిపించేంది. ఇప్పుడు భయానక పరిస్థి తులు ఎదురవుతున్నాయి. మనుషుల స్వార్థం కారణంగా పచ్చని అటవీ సంపద కళ్ల ముందే నాశనమవుతోంది. వందేళ్ల నాటి వృక్షాలు మొండి దుంగలుగా మిగిలిపోతున్నాయి. ఏలూరు ప్రాంతంలో విధులు నిర్వహించే ఓ అధికారి అమ రవరం అటవీ రేంజ్‌ ఇన్‌చార్జ్‌ అధికారిగా వ్యవ హరిస్తున్నారు. దీంతో రేంజ్‌పై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికే అటవీశాఖ ఆధ్వ ర్యంలో ఉన్న జామాయిల్‌ నర్సరీ ల్లో జామాయిల్‌ కర్రతోపాటు మారుజాతి కలప మాయం అవు తోంది. ప్రస్తుతం కొండపల్లి ఫారెస్ట్‌ బీట్‌ ప్రాంతం లో వారం రోజులుగా భారీగా చెట్లు నరికి వేస్తు న్నారు. ఆపై ఆనవాళ్లు కన్పించకుండా నిప్పంటిం చి కాల్చి వేస్తున్నారు. ఈ విధ్వంసాన్ని చూసిన కొందరు స్థానికులు మీడియాకు సమాచారం అందించారు. దీనిపై అమరవరం డిప్యూటీ రేంజ్‌ అధికారి అశోక్‌ను వివరణ కోరగా ‘కొండపల్లి ఫారెస్ట్‌బీట్‌లో అడవులు నరికినట్టు సమాచారం ఈ రోజే తెలిసింది. క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరుపుతా’మన్నారు. ఇదిలా ఉండగా అమరవరం అటవీరేంజ్‌ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో వార్తలొచ్చినప్పుడు జిల్లా స్థాయి అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యటించినా స్థానిక అటవీ సిబ్బందిపై ఏ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ఆగిరిపల్లి మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌

వలస నేత కనుసన్నల్లోనే తవ్వకాల జోరు

కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం

పట్టించుకోని కూటమి నేతలు.. ఆందోళనలో ప్రజలు

(నూజివీడు–ఆంధ్రజ్యోతి)

అమరావతి పేరిట ఏడాది కాలంగా అక్రమ మైనింగ్‌ వల్ల ఆగిరిపల్లి మండలంలో ప్రకృతి విధ్వంసమవుతోంది. అమరావతి కోసం మట్టి తరలింపు ముసుగులో కర్మాగారాలకు, వెంచర్లకు ఇతర వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటూ మాఫియా కోట్లు గడిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా జరగంత విధ్వంసం ఇప్పుడు చూస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. మండ లంలోని కొన్ని గ్రామాల్లో క్వారీలకు ప్రభుత్వ అనుమతులు వుండగా, మరికొన్నింటికి లేవు. అనుమతులు ఇచ్చిన దానికన్నా ఎక్కువ లోతు న తవ్వేస్తున్నా అధికారుల కంటికి కనిపించడం లేదు. ఈ మాదిరి ఇటీవల నర్సింగపాలెం క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తు లు మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఏలూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసి.. అక్రమాలు వాస్తవమేనని గుర్తించారు. అయినప్పటికి తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. ఇచ్చిన అనుమతులకన్నా ఎక్కువ తవ్వకాలు జరిపిన విషయంపై లీజుదారుడికి నోటీసులు ఇచ్చామని అతని నుంచి వివరణ రాగానే చర్య లు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు అధికా రులు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అద నంగా తవ్విన దానికి ఫైన్‌ కడతానని లీజు దారుడు చెప్పినప్పటికి అధికారులకు ఏదో నామ మాత్రపు ఫైన్‌ వేసి చేతులు దులుపుకున్నారు. అలాగే అనుమతులు తీసుకున్న ప్రాంతానికి సమీపంలోని బీ ఫారం పట్టా, రైతుల భూము లను వదలకుండా తవ్వే స్తున్నారు. క్వారీలపై అజమాయిషీ లేకపోవడంతో మట్టి మాఫియా కు అడ్డు లేకుండా పోతోంది. కొండలు, గుట్టలు వున్న ఆగిరిపల్లి మండలంలో ఎక్కువగా తవ్వ కాలు సాగిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొండలు, గుట్టల సమీప గ్రామాల్లో పశు సంపదకు మేత కరువయ్యే ప్రమాదం వుంది.

వలస నేత కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ !

ఆగిరిపల్లి మండలంలో అక్రమ మైనింగ్‌కు ఓ వలస నేతే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. అమ్మవారిగూడెం, నరసింగపాలెం, తోటపల్లి, వడ్లమాను, కలటూరు గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. మండలం లో ప్రతి కొండ, గుట్టల తవ్వకాలకు మైనింగ్‌ పర్మిషన్‌ కోసం దరఖాస్తులందాయి. మండ లంలో మట్టి తోలకానికి ఆ నేతకు తెలియా ల్సిందే. ఆయన అనుమతి లేకుండా మండలం లో ఏ శాఖ పని జరగదు. మైనింగ్‌ దరఖాస్తులు చేసిన వారంతా ఆయన మిత్రులు, శ్రేయోభి లాషులే కావడం విశేషం. గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి పక్క నియోజకవర్గంలో అధికారం చలా యించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిరి పల్లి మండలం సర్వాధికారిగా పెత్తనం చెలాయి స్తున్నారు. మైనింగ్‌ అనుమతులు వచ్చినా రాకున్నా ఏడాది నుంచి నిర్విరామంగా పగలు, రాత్రి అక్రమ మైనింగ్‌ జరుగుతూనే ఉంది. దీనివల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ మైనింగ్‌తో.. తోట ధ్వంసం

ఆగిరిపల్లి, మార్చి 16(ఆంధ్రజ్యోతి):అక్రమ గ్రావెల్‌ తవ్వకాలతో మామిడి తోటను ధ్వంసం చేశారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కలటూరుకు చెందిన గుడ్డేటి రమేష్‌ అనే రైతు చొప్పరమెట్ల గ్రామ రెవెన్యూ పరిధి లోని వలస గట్టు దిగువున ఉన్న సర్వే నెంబ రు 380లో 1.23 ఎకరాల భూమిలో అక్రమ మైనింగ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అధికా రులను కోరాడు.

Updated Date - Mar 17 , 2026 | 12:07 AM