Share News

పరాభవనామం కరుణించేనా!

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:06 AM

తెలుగువారి పండుగల్లో ఉగాదికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో పేరు. ఈ ఏడాది పరాభవనామ సంవత్సరం . అయితే రాజకీయ నాయకులకు అంతా శుభాలే నని పండితులు పేర్కొంటున్నారు.

పరాభవనామం కరుణించేనా!

స్థానికంలో పట్టు బిగిస్తారా ?

మాజీలు ఉన్నతంగా రాణించేనా..

నామినేటెడ్‌ కోరిక తీరేనా..

నిరుద్యోగులు జాబ్‌ క్యాలెండర్‌ ఊరట

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

తెలుగువారి పండుగల్లో ఉగాదికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో పేరు. ఈ ఏడాది పరాభవనామ సంవత్సరం . అయితే రాజకీయ నాయకులకు అంతా శుభాలే నని పండితులు పేర్కొంటున్నారు. సంస్కృతం లో పర అంటే అత్తుత్యమైన, గొప్పదైన లేదా అతీతమైన అని అర్థం గోచరిస్తుంది. భవ అంటే స్థితి లేదా పుట్టుక అని అర్థం. మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఓడించి (పరా భవం) ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మిం చడమే ఈ ఏడాది అసలు సందేశం. మన ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికి రాని ఆలోచనలను వదిలివేయడం అవసరం . ఆ వదిలివేతనే ఇక్కడ పండితులు పరా భవంగా వర్ణించారు.

ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఎలా ఉంటాయో జీవితంలో కష్ట,సుఖాలు అంతే. ఈ పరాభవ సంవత్సరంలో మనమంతా నేర్చు కోవాల్సిన ముఖ్య విషయం వ్యక్తిగత స్వయం పరివర్తన కలిగి ఉండటమే. బద్దకం వీడి... పొలిటికల్‌ నాయకులు ప్రజల సమస్యలే పరి ష్కారంగా ముందుకు సాగితే ఫలితాలు వాటంతటవే వస్తాయని భావించాలి. ఎన్నికల్లో పార్టీ జెండా మోసి పలుమార్లు అధికారంలోకి తీసుకువచ్చాం.. మమ్మల్ని పట్టించుకోడంటూ తెలుగుతమ్ముళ్లు, కమలనాథులు, జన సైని కులు కొట్టుమిట్టాడుతున్నారు. లింగపాలెం నుంచి మాజీ జడ్పీటీసీ గుత్తా సత్యసాయి వరప్రసాద్‌(పెదబాబు), చింతల పూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్‌ మండవ లక్ష్మణారావు, మైనార్టీ నాయకులు షేక్‌ ముస్తఫా, టీడీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్ర శేషు, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పెనుమర్తి రామ్‌కుమార్‌, మాజీ సొసైటీ అధ్యక్షుడు పరిమి సత్యనారా యణ (సత్తిపండు),జిల్లా తెలుగు రైతు మాజీ అధ్యక్షులు అబ్బినదత్తాత్రేయలు, మహిళా నేతలు పగడం సౌభాగ్యవతి, గుళ్లపూడి శ్రీదేవి ఆశిస్తున్నారు.కొయ్యలగూడెం నుంచి తెలుగు మహిళా అఽధ్యక్షురాలిగా రెండుసార్లు పనిచేసిన గంగిరెడ్డి మేఘలాదేవి, నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముదరబోయిన వెంకటేశ్వరరావు చాలాకాలం నుంచి చంద్రబాబునే నమ్ముకు న్నారు. బీజేపీలో చూస్తే పార్టీని అంటి పెట్టు కుని ఉన్నవారికి పదవులొస్తున్నాయి. ఇక్కడ కమలనాఽథుల నుంచి మిగతా పార్టీలు కొంత నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

స్థానికంలో మూడు ముచ్చట తీరేనా ?

రాబోయేది ఎన్నికల నామ సంవత్సరమే అని చెప్పాలి. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, నూజి వీడు పురపాలక సంఘాలకు ఖాళీ ఏర్పడింది. ఏలూరు కార్పొరేషన్‌లో సెప్టెంబరు నాటికి పాలకవర్గం సమయం ముగుస్తుంది. ఏప్రిల్‌ 2 నాటికి 547 పంచాయతీల పాలన ముగు స్తుంది. సెప్టెంబరు నాటికి ఎంపీపీ, ఎంపీటీసీ, 27 జడ్పీటీసీల పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికలకు ఓటర్ల జాబితాల సవరణ జరగాల్సి ఉంది. ఆలస్యమైనా అమృతంగా భావించి స్థానిక విజయం వైపే కూటమి పార్టీలు జతకట్టి సాగాల్సి ఉంటుంది.

నిరుద్యోగులకు మరింత లాభం

పరాభవనామ సంవత్సరం నిరుద్యోగులకు మరింత లాభం చేకూర్చే వీలుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్ల జోరు పెరిగింది. గతంలో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల కొలువులు జిల్లా వాసుల పట్టారు. పోలీ స్‌ కానిస్టేబుళ్లు, గ్రూప్‌–1 , గ్రూప్‌–2, సివిల్స్‌ లోనే భేషుగ్గానే ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం నైపుణ్య శిక్షణలను ఇస్తోంది. ఇటీవల జాబ్‌ మేళాల ద్వారా నాలు గువేల మంది వివిధ ఉద్యోగాల కల్పన చేపట్టిం ది. జిల్లా పరంగా ఉపాధి కల్పనా కార్యాలయం లో ఉద్యోగాల కోసం నమోదైన నిరుద్యోగులు సంఖ్య 44,633 మంది ఉన్నారు. పదివేల పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ను ఉగాది నాడు ప్రకటించ నుంది. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. కానిస్టేబుల్‌ నుంచి గ్రూప్‌–1 వరకు విఽవిధ ఉద్యోగాల భర్తీ రానున్న ఏడాదిలో జరగనుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువుల్లో కుదురుకో వచ్చు.. పరాభవనామం అందరికి మేలు చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 01:06 AM