Share News

వాడకం తగ్గేనా..!

ABN , Publish Date - May 14 , 2026 | 12:37 AM

ఇరాన్‌తో అమెరికా యుద్ధం తర్వాత వంట నూనెలు ధరలు సలసలా కాగాయి. సంక్షోభం నుంచి దాదాపుగా బయటపడ్డాం. ఇదే విషయంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం వంట నూనెలు వాడకం తగ్గించాలని ఇటీవల చేసిన ప్రకటన అందరిలో ఆలోచన రేకెత్తించింది.

వాడకం తగ్గేనా..!

ధర పెరుగుతున్నా తగ్గని వినియోగం

జిల్లాలో సగటున నెలకు 17 లక్షల లీటర్లు వినియోగం

ఇరాన్‌తో అమెరికా యుద్ధం తర్వాత వంట నూనెలు ధరలు సలసలా కాగాయి. సంక్షోభం నుంచి దాదాపుగా బయటపడ్డాం. ఇదే విషయంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం వంట నూనెలు వాడకం తగ్గించాలని ఇటీవల చేసిన ప్రకటన అందరిలో ఆలోచన రేకెత్తించింది. అయినా వంట నూనెల వినియోగం ఎక్కడా తగ్గడం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినప్పటికి.. ఆయిల్స్‌ వాడకం ఏ కోశాన తగ్గి వండడానికి ఎవ్వరు ఇష్టపడని పరిస్థితి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

కొన్ని సంస్థలు గతంలో సర్వేలు చేయగా ఏటా ఒక వ్యక్తి సగటున 8 నుంచి 10 లీటర్లు వంట నూనెలు వినియోగిస్తున్నట్టు తేలింది. తాజాగా ఇది 12 లీటర్లకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. మనకు ప్రధానంగా పామాయిల్‌, సన్‌ ఫ్లవర్‌లు సింగపూర్‌, మలేసియాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తద్వారా విదేశీ మారకం డాలర్ల రూపంలో వారికి పెరుగుతుంది. ఇదే విషయంపై ప్రధాన మంత్రి మోదీ వంట నూనెలు వాడకం తగ్గించాలని ప్రకటనతో సుమా రు 20 శాతం వరకు వంట నూనెలు వినియోగం తగ్గించినప్పటికి.. కొన్ని వర్గాలు ప్రజలు అత్యంత ఎక్కువగా వినియోగించడంతో వంట నూనెలకు డిమాండ్‌ ఎక్కడా తగ్గడం లేదు. జిల్లాలో 17 లక్షల మంది జనాభా ఉండగా నెలకు ఒక వ్యక్తి సగటున ఒక లీటరు వినియోగిస్తారని అంచనా వేస్తే 17 లక్షల లీటర్లు నూనె వాడేస్తున్నారు.

పెరిగి.. తగ్గిన నూనెల ధరలు

జిల్లాలో ఎక్కువ మంది వాడే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నెల క్రితం వరకు రూ.180కు కిలో లీటరు ప్యాకెట్‌ లభ్యం కాగా.. నేడు రూ.165–175 మధ్య విక్రయాలు సాగుతున్నాయి. వేరుశెనగ లీటర్‌ ప్యాకెట్‌ రూ.175కు, లూజు విక్రయాలైతే రూ.180 కు, పామాయిల్‌ రూ.750, కేఎల్‌ రూ.122 లకు విక్రయాలు సాగుతున్నాయి. ఎక్కువగా సన్‌ఫ్లవర్‌ వినియోగిస్తుండగా బ్రాండెడ్‌ వేరుశెనగ నూనె, పామాయిల్‌ను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అతి తక్కువ రైస్‌ రిచ్‌ ఆయిల్‌, తవుడు నుంచి తీసిన నూనెలను విని యోగిస్తున్నారు. 10 శాతం గానుగల నుంచి ఆడిన వేరుశెనగ నూనె కొంటున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న కొంతమందితో పాటు సంపన్నవర్గాల్లో వేరుశెనగ కల్తీ లేకుండా ఉన్నది చూసుకుని లీటరుకు రూ.250 నుంచి రూ.300 వరకు వెచ్చిం చి కొని వినియోగిస్తున్నారు.

కర్రీ.. టిఫిన్‌ పాయింట్లలో వినియోగం

ఇటీవల గల్లీగల్లీకి ఒక్కొ కర్రీ పాయింట్‌, నాలుగైదు టిఫిన్‌ పాయింట్లను వెలిశాయి. వీటిల్లో వివిధ రకాలు వంట నూనెలు వినియోగం పెరి గింది. ఏ వంట నూనె వాడుతున్నారో తెలియకుం డానే ఎడాపెడా కర్రీలు.. టిఫిన్లు లాగించేస్తుం టారు. ఇది అత్యంత హానికరంతో పాటు గుండె జబ్బులు రావడానికి ఆస్కారం వుంది.

గానుగ నూనె శ్రేయస్కరం

చాలాచోట్ల పల్లె, పట్టణాల్లో వేరుశెనగ గింజల్ని ఆడి నూనె విక్రయాలు సాగుతున్నాయి. ఏలూరులో డీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద గానుగ నూనె విక్రయాలు ఇటీవల పెరిగాయి. వేరుశెనగ నూనె లీటరు రూ.300, పప్పునూనె రూ.370కు విక్రయాలు సాగుతు న్నాయి. ప్యాకెట్ల వినియోగం కంటే ఇవే ఎక్కువ శ్రేష్టమైనవి.

ఆయిల్‌ వాడకం తగ్గిస్తే ఆరోగ్యానికి మేలు

శరీర బరువు ఆధారంగా వంట నూనెల వాడకం ఉండాలి. ఊబ కాయం, డయాబెటిస్‌, గుండె జబ్బులున్న వారు ఆయిల్‌ వాడకం తగ్గించడం ఆరోగ్య రీత్యా మం చిది. నాణ్యమైన సన్‌ఫ్లవర్‌ వాడకం అందరికి ఉపయో గం. కొన్ని రకాలు బయట నూనెలు వాడడం వల్ల చెడు కొలెస్ర్టాల్‌ పెరిగి.. గుండె జబ్బులకు కారణమవుతాయి. సాధ్యమైనంత వేపుడు కూరలకు దూరంగా ఉండడం మంచిది. సూప్‌, సాం బార్‌ తదితర వంటకాలతో నూనె వినియోగం తక్కువగా ఉంటుంది.

–డాక్టర్‌ ఎ.హరికృష్ణ,

జనరల్‌ ఫిజిషియన్‌, ఏలూరు.

Updated Date - May 14 , 2026 | 12:37 AM