Share News

ఉపాధిపై చిన్నచూపేలా..?

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:56 AM

నిరుద్యోగ యువత ఉపాధి మార్గాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్‌ ఈ ఏడాది జరగలేదు.

ఉపాధిపై చిన్నచూపేలా..?

అరకొర యూనిట్లు.. పరిశ్రమల కేంద్రం నుంచి 49 గ్రౌండింగ్‌

ప్రాసెసింగ్‌ యూనిట్లు అంతంతే

తేలని బీసీ రుణాల వ్యవహారం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

నిరుద్యోగ యువత ఉపాధి మార్గాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్‌ ఈ ఏడాది జరగలేదు. మార్చి 31న మంగళవారం నాటికి సగం లక్ష్యం పూర్తికా లేదు. దీంతో నిరుద్యోగుల ఉపాధికి భరోసా కలగడం లేదు. ఏప్రిల్‌ మొదటి వారం అంతా బ్యాంకు, వివిధ సంస్థలు తమ లెక్కలతో కాలం గడిపేస్తాయి. ఆ తర్వాత కొంతలో కొంత పాత సంవత్సరం యూనిట్ల మంజూరు ప్రకారం గ్రౌండింగ్‌ జరిగితే నిరుద్యోగులు మేలు జరిగి నట్లే. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వంలోను ఆటుపో ట్లు తప్పడం లేదు. ఉపాధి కల్పనకు ఉద్దేశించిన యూ నిట్ల స్థాపన నత్తనడకన సాగుతోంది. దరఖాస్తులు చేసు కోవడం వరకు బాగానే సాగుతున్నా రుణాలు ఇచ్చి.. యూనిట్ల గ్రౌండింగ్‌ దగ్గరే అసలు సమస్య ఎదురవు తోంది. వివిధ బ్యాంకు బ్రాంచిలు రుణాలు మంజూరు విషయంలో అలక్ష్యం వహించడంతో ఉపాధి యూనిట్ల స్థాపనలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.

పీఎంఈజీపీ అంతంతే..

జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన (పీఎంఈజీపీ) పథకం కింద సబ్సిడీ మొత్తాలను పెంచినా.. యూనిట్ల గ్రౌండింగ్‌ అసలు సమస్యగా మారింది. ఈ పథకం జిల్లాలో 345 దరఖాస్తులను జిల్లా పరిశ్రమల కేంద్రం స్వీకరించింది. ఇందులో వడపోత, అర్హతల ఆధారంగా 161 యూనిట్లు మంజూరుకు రూ.7 కోట్లపైబడి నిధులను వెచ్చించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. తీరా ఆచరణలో కేవలం 49 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్‌ చేయగలిగారు. ప్రధానంగా బ్యాంకుల నుంచి సబ్సిడీ మొత్తాల జమ పడకపోవడం.. యూనిట్ల పరిశీలన ఇంకా సాగకపోవడంతో లక్ష్యం లో 50 శాతానికి కూడా అధికారులు చేరుకోలేకపోయారు. దీనికి ఎలా లేదన్నా మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.

ఆహార శుద్ధి ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఊరట : జిల్లాలో ప్రధాన మంత్రి ఆహారశుద్ధి ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన విషయంలో కొంత ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయి. జిల్లాలో 168 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 166 యూనిట్లకు మంజూరును ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చారు. గ్రౌండింగ్‌ ప్రొసీడింగ్స్‌ మాత్రం 85 యూనిట్లకు చేశారు. దీంతో 50 శాతం లక్ష్యాన్ని సాధించారు. ఈ యూనిట్ల స్థాపనలో బ్యాంకర్ల విభాగం నుంచి సరైన ప్రోత్సాహం నిరుద్యోగులకు అందడంలేదన్న విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరం లోనైనా లక్ష్యం వేగంగా పూర్తిచేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీసీ కార్పొరేషన్‌కు మొండిచేయ్యే : బీసీలకు సత్వరం న్యాయం జరుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు మొండిచేయ్యే ఎదురైంది. జిల్లాలో రెండు వేల మందికి పైబడి నిరుద్యోగులు ఉపాధి యూనిట్లు కోసం దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు రుణాల మంజూరు ఊసే లేకుండా ఉంది. దీంతో రాబోయే ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుల బూజు దులిపి.. యూనిట్ల స్థాపనకు అడుగులు పడతాయా? అన్న ఉత్కంఠ బీసీ కార్పొరేషన్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

నేటి నుంచి ఉచిత వైద్యం బంద్‌

ఏలూరు అర్బన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): బకా యిల చెల్లింపునకు డిమాండ్‌ చేస్తూ ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు బుధవారం నుంచి ఉచిత వైద్య సేవలను నిలిపివేయడానికి రంగం సిద్ధం చేసు కున్నాయి. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశ) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మంగళవారం సాయంత్రం వరకు ఏలూరు జిల్లాలో మూడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు జిల్లా అధికారులకు సమాచార మిచ్చాయి. జిల్లాలో ఉచిత వైద్యసేవల నిమిత్తం 32 స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టులో నమోదయ్యాయి. వీటిలో రోజుకి 200 మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. వైద్యపరీక్షల అనంతరం సర్జరీలు, డెలివరీలు పొందిన మరో వందమంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. ఉచిత వైద్యసేవకింద 3,252 ప్రొసీజర్లకు వైద్య సేవలందుతుంటాయి. ఏటా సుమారు రూ.25 కోట్ల వరకు జిల్లాలోని నెట్‌వర్క్‌ అసుపత్రులకు ఉచిత వైద్య సేవలందించినందుకు ప్రభుత్వం చెల్లి స్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రు లకు సుమారు రూ.70 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ బకాయిలు విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా బుధ వారం నుంచి ఉచిత వైద్యసేవలను నిలిపి వేయ డానికి జిల్లాలోని కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిర్ణయించాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం

ఉచిత వైద్యసేవలను బుధవారం ఒక్కరోజు నిలిపి వేస్తామని ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్‌, శంకర నేత్ర చికిత్సాలయ, న్యూ విజయ కంటి ఆసుపత్రి యాజ మాన్యాలు ఇప్పటివరకు సమాచారమిచ్చాయి.ఆ మేరకు ఉచిత వైద్యసేవలను నిలిపివేసే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వద్ద ఆరోగ్యమిత్ర కార్యకర్తలను అప్రమత్తం చేశాం. అత్యవసర వైద్యసేవలకువచ్చే రోగుల సమా చారాన్ని ఆరోగ్యమిత్రలు మాకు తెలియజేసిన వెంటనే అక్కడకు 104, 108 అంబులెన్సు వాహానాలను పంపించి, రోగు లను సమీప ఆసుపత్రులకు తరలించడానికి ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేశాం. ఏలూరులో సూపర్‌ స్పెషా లిటీ వైద్యసేవలందించడానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోని గుడ్‌ సమరిటన్‌ ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రి ఉచిత వైద్యసేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చినందున రోగులకు ఎటువంటి సమస్యలు ఎదురుకానివ్వం.

– డాక్టర్‌ రాజీవ్‌, ఎన్టీఆర్‌ వైద్యసేవ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్‌

Updated Date - Apr 01 , 2026 | 12:56 AM