ఉత్కంఠ
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:52 AM
జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణకు గడువు సమీపిస్తోంది. కూటమి తరపున జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఆయా పార్టీలో ఉత్కంఠ నెలకొంది.
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిదో..?
తేలని కూటమి అభ్యర్థి
ఉండి జడ్పీటీసీపైనే అందరి దృష్టి
టీడీపీకి ఇస్తే పొత్తూరి రామరాజు
జనసేనకైతే పీవీఎల్ నరసింహరాజు
జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణకు గడువు సమీపిస్తోంది. కూటమి తరపున జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఆయా పార్టీలో ఉత్కంఠ నెలకొంది. కూటమిలో టీడీపీ, జనసేన నుంచి జడ్పీ చైర్మన్ ఆశావహులు ఇద్దరూ ఉండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇరుపార్టీల అధిష్ఠానం నిర్ణయం ఇంకా వెలువడకపోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కూటమి తరపున జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోవడంతో ఆ పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఉన్నాయి. ఈ నెల 27న పరిషత్ నామినేషన్‌ల గడువు ముగియనుంది. ఈలోపు అభ్యర్థి ఎవరనేది ప్రకటించాలి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ నుంచి నరసాపురం టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, జన సేన నుంచి పీవీఎల్ నరసింహరాజు ఆశిస్తున్నారు. ఇద్దరు నాయకులు ఉండి జడ్పీటీసీ స్థానంలో నామినేష న్ వేశారు. కూటమి అధిష్ఠానం నుంచి స్పష్టత వస్తే చైర్మన్ అభ్యర్థి బరిలో ఉంటారు. ఎటువంటి నిర్ణయం వెలు వడకపోతే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌లు ఉప సంహరించుకోనున్నారు. స్థానికంగా టీడీపీ తరపున జడ్పీ టీసీగా నామినేషన్ వేసిన ముదునూరి కృష్ణంరాజు మాత్రమే బరిలో ఉండేలా స్థానిక కూటమి నాయకత్వం పరస్పర సయోధ్యతో ముందుకు వెళుతోంది.
కూటమి అధిష్ఠానం జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై నిర్ణయం ప్రకటించలేదు. మున్సిపాలిటీల విషయంలోనే నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు కూడా పంపకాలు జరిగిపోయాయి. గణపవరం, ఆకివీడు మం డలంలో ఎంపీపీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. గణపవరం లో ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజ నేయులు మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంది. ఆకివీడు ఎంపీపీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ముగ్గు రు ఆశావహులు ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ వేశారు. మిగిలిన మండలాల్లో ఒక స్పష్టతతో కూటమి ముందుకు వెళుతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలోనే అధి ష్ఠానం నిర్ణయం తీసుకోవాలి.
ఇంకా సంప్రదింపులు
మూడు పార్టీల అధినేతలు ఆదివారం సంప్రదింపులు జరిపి స్పష్టత ఇస్తారని జిల్లా కూటమి నేతలు ఆశించినా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. జిల్లాలో ఇద్దరు ఆశా వహులు కూడా ఉండి నుంచే బరిలో ఉండడంతో నాయ కుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కేటాయి స్తారని ఒకసారి, జనసేనకు ఇస్తారని మరోసారి ఆదివా రం ఊహాగానాలు నడిచాయి. జిల్లాలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉండిలో మాత్రం ప్రచారం చేయలేకపోతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిత్వంపై కూటమి అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం కూటమి శ్రేణుల్లో నెలకొంది.