ఆన్‌లైన్ అర్జీలు తూచ్!
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:58 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ఆధునిక సాంకేతికను అందుబాటు లోకి తీసుకొచ్చినా.. వినియోగించుకునేవారు శూన్యమనే చెప్పాలి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ఆధునిక సాంకేతికను అందుబాటు లోకి తీసుకొచ్చినా.. వినియోగించుకునేవారు శూన్యమనే చెప్పాలి. సునాయాసంగా అర్జీలు సమర్పించే అవకాశాలను ప్రజలు క్లిష్టంగా మార్చుకుంటున్నారు. ఇదేమంటే వారిలో అవగాహన కల్పించేవారే కరువయ్యారు. ప్రతివారం కలెక్టరేట్‌లో జరుగుతున్న పీజీ ఆర్‌ఎస్‌కు అర్జీదారుల తాకిడి తప్పడం లేదు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఒక ప్రహసనంలా సాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి వారం మూడు వందలకు తగ్గకుండా అర్జీదారులు పోటెత్తు తున్నారు. వారి సమస్యలన్నీ తీరుతున్నాయంటే.. అదొక ప్రశ్నే. ఎన్నిమార్పులు, చేర్పులకు చోటు కల్పించిన అర్జీ దారుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లా యంత్రాంగం అంతా నాలుగు గంటలపైగా గోదావరి సమావేశ మందిరంలో కుస్తీ పట్టి.. జల్లెడ పడుతున్నా.. సమస్యలు అవే పున రావృతం కావడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ప్రతి శుక్రవారం ఆయా జిల్లా, డివిజన్, మండస్థాయిలో సమీ క్షలు అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నా అర్జీదారుల సంఖ్య తగ్గడం లేదు. మూడు నెలలు నుంచి ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌లు పేరిట వినతులను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అయినా ఎక్కడ అర్జీదారుల తాకిడి తగ్గడం లేదు.
ఆన్‌లైన్‌లో అర్జీలకు కానరాని స్పందన
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపుగా ఐదు నెలలు నుంచి ఆన్‌లైన్‌లో అర్జీలు తీసుకుంటు న్నారు. అయితే ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రజలకు అవగా హన కల్పించడంలో విఫలమైందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆన్‌లైన్ విధానాన్ని వివరిస్తూ బ్యానర్లు, ఫ్లకార్డులు, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డెస్క్‌లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తే ఆన్‌లైన్‌లో అర్జీల నమోదుకు ప్రజలకు సులభతరం అవుతుంది.
వెబ్‌సైట్‌లో నమోదు
మీకోసం వైబ్‌సైట్ లో ఏపీ.జీవో.ఇన్‌లోకి వెళ్లి సమస్య ఏంటనేది నమోదు చేయాలి. ఈ అర్జీ తొలుత క్షేత్ర స్థాయిలో ఉండే (స్వర్ణగ్రామ, వార్డు) అధికారులకు చేరు తుంది. అక్కడ పరిష్కారం లభించిక పోయినా.. అర్జీదారు సంతృప్తి చెందక పోయినా మళ్లీ రీ ఓపెన్ చేయవచ్చు. రెండోసారి రీ ఓపెన్ చేశాక మండలం.. ఆ తర్వాత డివి జన్, అనంతరం జిల్లా స్థాయి అధికారి వద్దకు అర్జీ వెళ్తుంది. సమస్య పరిష్కారమయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది.
పరిష్కారం కాకపోతే 1100కు ఫిర్యాదు
అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా అది ఏ స్థాయిలో ఉందన్న సమాచారం తెలుసుకోవాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేయొచ్చు. ఇక్కడా అర్జీ నమోదుకు అవకాశం ఉంది. ఈ సేవలను అందిపుచ్చుకునే వారే కరువయ్యారు.
అధికారులకు గుంజీలే..
ఏలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌లో వేదికపై కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలన చేసే సందర్భంలో అర్జీకు బాధ్యులైన అధికారులను పదేపదే వేదికపై పిలుస్తుండడంతో అధికారులు గుంజీలు తీసినంత పని అవుతోంది. సీట్‌లో కూర్చోవడం.. మళ్లీ లేచి వెళ్లడం వల్లవారు ఒత్తిడికి గుర వుతున్నారు. ఆర్డీవోలు, సర్వే, కార్పొరేషన్ ఇతర శాఖలపై సమస్యలు ఎక్కువగా వచ్చే అధికారులను స్టేజీపైనే కుర్చీలు వేయడం ఉత్తమమనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
38 ఫిర్యాదుల స్వీకరణ
ఏలూరు క్రైం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి):ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా సమీపంలో ఉన్న సీఐ, డీఎస్పీ కార్యా లయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచిం చారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో 38 మంది ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.