అసలేం జరుగుతోంది..!
ABN , Publish Date - May 11 , 2026 | 12:44 AM
ముదినే పల్లిలోని ప్రభుత్వ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌కు కొందరు ఉద్యో గుల మధ్య ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరడం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతిశ్రీ ఆత్మహత్యాయత్నం వైద్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయి విచారణ నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ముదినేపల్లి పీహెచ్‌సీపై విచారణకు డీఎంహెచ్‌వో డాక్టర్ శోభారాణి ఆదేశం
ముదినేపల్లి, మే 10 (ఆంధ్రజ్యోతి): ముదినే పల్లిలోని ప్రభుత్వ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌కు కొందరు ఉద్యో గుల మధ్య ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరడం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతిశ్రీ ఆత్మహత్యాయత్నం వైద్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయి విచారణ నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.
పీహెచ్‌సీలో కొంతకాలంగా మెడికల్ ఆఫీసర్‌కు ముగ్గురు సిబ్బందికి మధ్య పలు విషయాలపై విభేదాలు ఏర్పడడం, ఓ ఉద్యోగిని భర్త బహిరంగంగా మెడికల్ ఆఫీసర్ మత మార్పి డులకు పాల్పడుతున్నారని ఆరోపించిననేపఽథ్యంలో ఇటీవల జిల్లా వైద్యశాఖ అధికారులు విచారణ నిర్వహించి సర్దుబాటు చేశారు. మళ్లీ ఆదే సమస్య ఎందుకు పునరావృతం అయింద నేది విచారించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఏలూరు డీఎంహెచ్‌వో డాక్టర్ శోభారాణి పీహెచ్‌సీ ప్రోగ్రాం ఆఫీసర్‌ను ఆదేశించారు. మరోవైపు విబేధాలు ఉన్నప్పటికీ మెడికల్ ఆఫీసర్ శాంతిశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుం టున్నారు. కాగా డాక్టర్ శాంతిశ్రీ శుక్రవారం రాత్రి తాను నివాసముంటున్న కృష్ణా జిల్లా పామర్రులో ఎక్కువ మోతాదు లో యాంటీ బయో టిక్ టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడం సంచలనం కలిగించింది. తాను ఆత్మహత్య చేసుకుంటు న్నట్టు డాక్టర్ శాంతిశ్రీ పీహెచ్‌సీలోని కొంత మంది ఉద్యోగులకు, ముదినేపల్లి ఎస్‌ఐ వీరభద్ర రావుకు వాట్సాప్‌లో ఒక లెటర్ పంపారు. ఒక ఉద్యోగిని భర్త తనను అల్లరి చేయడమే గాక పీహెచ్‌సీకి వచ్చి ఇటీవల గొడవ చేశాడని ఆ గొడవను ముదినేపల్లి ఏఎస్‌ఐ సరిచేశారని లెటర్‌లో పేర్కొన్నారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనను బదిలీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తాను అవమానాలు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఎస్‌ఐ వీరభద్రరావు వెంటనే ఆమెకు ఫోన్ చేసి తొందరపడవద్దని, పరిస్థితిని చక్కదిద్దుతామంటూ నచ్చచెప్పి మరోవైపు పామర్రు పోలీసులకు సమాచారం పంపారు. జీపీఎస్ ద్వారా అక్కడి పోలీసులు ఆమె అడ్రస్‌ను గుర్తించి ఆమె నివాసానికి వెళ్లి ఆమెను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిం చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. శనివారం ఏలూరు డీఎంహెచ్‌వో డాక్టర్ శోభా పామర్రు వెళ్లి ఆమెను పరామర్శించారు.
విచారణ జరుపుతాం : డీఎంహెచ్‌వో
ముదినేపల్లి పీహెచ్‌సీలో నెలకొన్న పరిస్థితులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతిశ్రీ ఆత్మహత్యాయత్నం తదితర అంశాలపై విచారణ చేస్తాం. ఆ పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌కు, కొందరు సిబ్బందికి ఏర్పడిన విభేదాలపై ఇటీవల విచారణ జరిపించాం. ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిస్థితులపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం.