Share News

ఏమైంది..?

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:59 AM

రెవెన్యూ శాఖ ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాలను ఎంపికచేసింది. అక్కడ 11 వేల నమూనాలను పరిశీలించారు. ఈకేవైసీ, ఇతర సమస్యలతో కేవలం ఆరు వేల పాస్‌ పుస్తకాలకు మాత్రమే ఈకేవైసీ పూర్తయ్యింది.

ఏమైంది..?

ఇతర ప్రాంతాల్లోని భూ యజమానులతో తంటా

ఈకేవైసీ పెండింగ్‌తో పరిశీలన అంతంతమాత్రమే

మార్చి 9న మలి విడత పట్టాదారు పాస్‌ పుస్తకాలు

లక్ష్యం 11 వేలు.. ముద్రణకు వెళ్లింది 6 వే లు మాత్రమే

మార్చి 9న పాస్‌ పుస్తకాల పంపిణీకి

రెవెన్యూ శాఖ ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాలను ఎంపికచేసింది. అక్కడ 11 వేల నమూనాలను పరిశీలించారు. ఈకేవైసీ, ఇతర సమస్యలతో కేవలం ఆరు వేల పాస్‌ పుస్తకాలకు మాత్రమే ఈకేవైసీ పూర్తయ్యింది. ముద్రణకు వెళ్లిపోయాయి. వాటిని మార్చి 9న పంపిణీ చేయనున్నారు. మరో ఐదు వేల పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. స్థానికంగా భూ యజ మానులు అందుబాటులో లేకపోవడంతో పరిశీలన పూర్తి చేయలేకపోతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలోని ఓ భూయజ మాని హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి ఇక్కడ భూమి ఉంది. గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయ్యింది. పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలి. డ్రాఫ్ట్‌ వెరిఫికేషన్‌ కోసం అతనికి పం పారు. నమూనా సవ్యంగా ఉంద ని సదరు భూయజమాని బదులిచ్చారు. పట్టాదారు పాస్‌ పుస్తకం రావాలంటే ఈకేవైసీ చేయాలి. ఇక్కడ అందుబాటులో లేరు. రెవెన్యూ సిబ్బంది హైదరాబాద్‌ వెళ్లలేరు. ఇందుకోసం యజమాని మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ చెప్పమని సిబ్బంది అడిగారు. అది చెపితే ఈకేవైసీ పూర్తవుతుంది. అక్కడే చిక్కొచ్చి పడింది. నిజంగా మీరు రెవె న్యూ సిబ్బందేనా.. కాదా..? బ్యాంకు నుంచి చేస్తున్నారా..? మీకెందుకు ఓటీపీ చెప్పాలంటూ భూయజమాని ప్రశ్నించారు. సైబర్‌ నేరాలు అధికం కావడంతో రెవెన్యూ సిబ్బంది ఎదురు చెప్పలేదు. ఈకేవైసీ నిలిపివేయడంతో పట్టా దారు పాస్‌ పుస్తకం ముద్రణకు అవకాశం లేకపోయింది. ఇటువంటి అనుభవాలు రెవెన్యూ సిబ్బందికి జిల్లా అంతటా వెంటాడుతున్నాయి. తొలివిడత ప్రభుత్వం 110 గ్రామాల్లో 75,804 పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంది. అందులో చాలావరకు తప్పులు దొర్లాయి. సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం కొత్త పుస్తకాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. నమూనా పాస్‌ పుస్తకాన్ని రైతుల వద్దకు తీసుకు వెళ్లి ఆధార్‌ కార్డు, రైతు పేరు, ఫోన్‌ నెంబర్‌ సక్రమంగా ఉంటే ఈకేవైసీ చేసి ముద్రణకు పంపిస్తున్నారు. మ్యూటేషన్‌, ఇతర సమస్యలు వుంటే తహశీల్దార్‌ స్థాయిలో పరిష్క రించిన తర్వాత ముద్రణకు వెళుతున్నాయి. ఏప్రిల్‌ 9న పుస్తకాలు అందజేతకు జిల్లాలో మరో 16 గ్రామాలను గుర్తించారు. సదరు గ్రామాల్లో 13 వేల నమూనాలను పరిశీలించాలి. సగటున 55 శాతం మాత్రమే పూర్తి కానున్నాయని అధికారుల అంచనా.

రైతుల్లోనూ ఉదాశీనత

గతంలో పాస్‌ పుస్తకాల కోసం రైతులే అధికారుల చుట్టూ తిరిగేవారు. బ్యాంకు రుణాలకు అవసరమయ్యేది. ఇప్పుడు దీనితో పనిలేదు. రుణాలు మంజూరు చేస్తున్నారు. దీంతో వీటి కోసం రైతులు ఆసక్తి చూపడం లేదు. ఆన్‌లైన్‌లో పేరుంటే సరిపోతుందన్న భావనతో ఉన్నారు. ఇది కూడా రెవెన్యూ సిబ్బందికి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అను కున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:59 AM