Share News

జిల్లా పరిషత్‌ విభజనకు కసరత్తు

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:55 PM

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాతిపదిక న జిల్లా పరిషత్‌ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభ మైంది. అందుకు సంబంధించిన భవనాలు, స్థలాల గుర్తింపు, ఉద్యోగుల జాబితా లను సిద్ధం చేయాలంటూ జడ్పీ అధికారులకు ఆదే శాలు జారీ అయినట్లు సమాచారం.

జిల్లా పరిషత్‌ విభజనకు కసరత్తు

ఏలూరు, పశ్చిమ జడ్పీలుగా విభజించే యోచన

భవనాల గుర్తింపునకు ఆదేశాలు

ఉద్యోగుల జాబితాల పరిశీలన

సెప్టెంబరు నాటికి జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తి

ఏలూరుసిటీ, పిబ్రవరి 9 (ఆంరఽధజ్యోతి): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాతిపదిక న జిల్లా పరిషత్‌ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభ మైంది. అందుకు సంబంధించిన భవనాలు, స్థలాల గుర్తింపు, ఉద్యోగుల జాబితా లను సిద్ధం చేయాలంటూ జడ్పీ అధికారులకు ఆదే శాలు జారీ అయినట్లు సమాచారం. ఏలూరు లో జడ్పీకి సొంత భవనాలుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో స్థలం, భవనాలు కావాలి. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఇచ్చిన ఆదేశాల ననుసరించి భవనాలు గుర్తింపు చర్యలను జడ్పీ అధికారులు చేపట్టారు.

జిల్లాల విభజన జరిగి మూడేళ్లు దాటినా ఇప్పటికీ జడ్పీ పాలన మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మండలాలు ఏలూరు, పశ్చిమ గోదా వరి జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కలిశాయి. దీంతో జడ్పీ సమావేశం జరుగు తున్నప్పుడు మూడు జిల్లాల నుంచి అధికారు లు రావాల్సి ఉండడం, సమావేశాలకు సంబం ధిత ఉన్నతాధికారులు హాజరు కాక పోవటం పై ప్రజాప్రతినిధులు తీవ్రంగా నిల దీస్తున్నారు. సమస్యలు ఎవరికి తెలియ జేయాలో తెలియడం లేదంటూ జడ్పీటీసీలు గగ్గోలు పెడు తున్నారు. దీంతో జడ్పీ పాలన కుంటుపడిందన్న విమర్శలున్నాయి. 2026 సంవత్సరం సెప్టెం బరు 24 వతేదీ నాటికి ఉమ్మడి జడ్పీ పాలన కాలం ముగియనుంది, ఎన్నికల నిర్వహణ సమయా నికి జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ల విభజన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలతో వెల్లడవుతోంది.

ఉద్యోగుల జాబితాపై కసరత్తు

జిల్లా పరిషత్‌ల విభజనతో ఉద్యోగులను ఇరువైపులా సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో సీనియార్టీ, కేడర్‌ ప్రాతిపదికన ఉద్యో గుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ముందుగా ఉద్యోగులు ఏ జిల్లాకు వెళ్ళాల నుకుంటున్నారో తెలుసుకోనున్నారు. తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

ఉద్యోగుల జాబితాతో పాటు కొత్తగా ఏర్పా టైన పశ్చిమగోదావరి జిల్లాలో భవనాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలు స్తోంది. జడ్పీ విభజన పూర్తి అయితేనే ఎన్నికలు సజావుగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ అంతా విభజిత జిల్లాల పరిషత్‌ల ఆధారంగానే జరగాలి. ఇవన్నీ జరగాలంటే జిల్లా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికి జిల్లా పరిషత్‌ల విభజన పూర్తి కావాల్సి ఉంది. ఏప్రిల్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటి నుంచి జిల్లా పరిషత్‌ల పాలన జిల్లాల వారీగానే జరగనుందని కూడా తెలుస్తోంది.

భవనాలు, స్థలాల పరిశీలనకే ఆదేశాలు : ఎం. శ్రీహరి, జడ్పీ సీఈఓ

జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ ఏర్పాటుకు సంబంధించి భవనాలు, స్థలాలు పరిశీలనపై మాత్రమే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చా యి. ఇంకా పూర్తి మార్గదర్శకాలు రాలేదు. జిల్లా పరిషత్‌ల వారీగా ఉద్యోగుల జాబితాల తయారీ వంటి వాటిపై ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు.

Updated Date - Feb 09 , 2026 | 11:55 PM