కోస్టల్ కారిడార్ కల!
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:07 AM
ఉమ్మడి పశ్చిమలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం నరసాపురం పరిధిలో ఉంది.
ఆశలన్నీ పోర్టుపైనే..
పోర్టు నిర్మాణంతో తీరానికి మహర్దశ
యువతకు ఉపాధి
గతంలో సర్వేతో స్వస్తి
చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి
ఉమ్మడి పశ్చిమలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం నరసాపురం పరిధిలో ఉంది. సరిహద్దులో తూర్పు, కృష్ణా జిల్లాలను కలుపుకుంటూ సుమారు 90 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించింది. ఇప్పటికే కాకినాడ ప్రాంతం కోస్టల్ కారిడార్‌గా అభివృద్ధి చెందింది ఇటు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రెండు జిల్లాల నడుమ నరసాపురం పరిధిలో వనరులు, వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ పారిశ్రామికాభివృద్ధి జాడ లేదు. గడిచిన 40ఏళ్లుగా నేతల హామీలన్నీ నీటి మూటలగానే మిగిలిపోయాయి.
నరసాపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): నరసాపురం తీర ప్రాంతంలో 1977లో ఓఎన్‌జీసీ చేపట్టిన తవ్వకాల్లో అపార గ్యాస్, అయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈప్రాంతంలో ఉత్ప త్తి అవుతున్న గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారే తప్ప ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. అయిల్ శుద్ధి కర్మాగారాన్ని కూడా గ్యాస్ ఆధారిత పవర్ ప్లాం ట్‌ను విజ్జేశ్వరం వద్ద ఏర్పాటుచేసి నరసాపురానికి చిన్నచూపు చూశారు. సుమారు 19కిలోమీటర్ల మేర కోస్టల్ తీరం విస్తరిం చినా ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. ఏటా రూ.150 కోట్లుపైనే ఆక్వా ఉత్పత్తులు నరసాపురం నుంచే దేశ విదేశాల కు ఎగుమతి చేస్తున్నారు. ఇక లేస్ పరిశ్రమ, కొబ్బరి ఉత్పత్తు లు పుష్కలం. మొగల్తూరు, నరసాపురం మండలంలో పరిశ్ర మల ఏర్పాట్లుకు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది.
నెరవేరని హామీలు..
గతంలో ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు నేతలు హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. 25ఏళ్ల క్రితం అప్పటి కేంద్రమంత్రి యూవీ.కృష్ణంరాజు పేరుపాలెం ప్రాంతం లో అయిల్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారు. సర్వే కూడా చేపటినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తరువాత ఇదే ప్రాంతానికి చెందిన దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నరసాపురంలో పర్యటించి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇండోనే షియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని జిందాల్ సంస్థ పవర్ ప్లాంట్ నిర్మిస్తుందని ప్రకటించారు. అయితే ఇది కూడా ముం దుకు సాగలేదు. ఇక 2006లో గ్రీన్‌ఫీల్డ్ సంస్థ థర్మల్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. సర్వే కూడా చేపట్టినప్పటికీ కూడా వెనక్కి వెళ్లింది. అప్పట్లో 216 జాతీయ రహదారి, రైల్వే డబ్లింగ్ లైన్ లేవు. ప్రస్తుతం తీరం వెంబడి జాతీయ రహదారితో పాటు విజయవాడ– నరసాపురం మధ్య డబ్లింగ్ లైన్ కూడా ఏర్పడింది.
రాష్ట్ర విభజనతో తెరపైకి పోర్టు..
రాష్ట్ర విభజన తరువాత నరసాపురంలో పోర్టు నిర్మిస్తున్నట్లు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. నరసాపురం మండలం వేములదీవి, బియ్యపుతిప్ప, మొగల్తూ రు మండలం కేపీపాలెం, పేరుపాలెం, మొళ్లపర్రు వద్ద సర్వే కూడా చేసి 300 ఏకరాలను గుర్తించారు. అప్పట్లో కొంతమంది దీనిని వ్యతిరేకించిన నేపథ్యంలో ఇది పెండింగ్ పడింది.
నిర్మలమ్మ చొరవ
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం లంకలో పర్యటించారు. నరసాపురం జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజీలు తరలిపోవడంతో ఈప్రాంతం ఆర్థికంగా వెనుకబాటుకు గురైందని స్థానిక నేతలు ఆమెకు వివరించారు. పోర్టు నిర్మాణం తెరపైకి తెచ్చి ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారని విన్నవించారు. దీనితో నిర్మలమ్మ నరసాపురం అభివృద్ధిపై చొరవ చూపుతున్నారు. పర్యటన అనంతరం కేంద్ర మంత్రి అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. వనరులున్నా అభివృద్ధి లేదని, కనీసం పోర్టునైనా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై చంద్రబాబు కేబినేట్ సమావేశంలో ప్రస్తావించారు. పోర్టుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి నిమ్మలకు బాధ్యత అప్పగించారు.