బరువులెత్తి.. ప్రతిభ చాటారు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:12 AM
బరువెంతైనా.. బలమే ఆయుధంగా.. వివిధ కేజీల్లో భారీ బరువులను ఎత్తి మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఉత్సాహంగా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయుట్ లిఫ్టింగ్ పోటీలు
ఏలూరు రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : బరువెంతైనా.. బలమే ఆయుధంగా.. వివిధ కేజీల్లో భారీ బరువులను ఎత్తి మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో సుస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం 45, 49, 53, 57, 61, 69, 77, 86 కేజీల విభాగాలలో పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి 40మంది మహిళలు పాల్గొనగా 30 మంది ఎంపికయ్యారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదాన ఉత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి సతీమణి చేతుల మీదుగా విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య, యూడ చైౖర్మన్ శివప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, సెట్‌వెల్ సీఈవో ప్రభాకర్, సాయి సెంటర్ డీడీ గుర్నామ్ సింగ్, డీఎస్‌డీఎస్‌ఏ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.