కష్టపడి ఉద్యోగం సాధించుకున్నాం
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:44 AM
మెగా డీఎస్సీని దగా డీఎస్సీ అంటూ తప్పుడు ప్రచారం చేసి ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
కైకలూరులో ఉపాధ్యాయుల ప్రదర్శన
కైకలూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):మెగా డీఎస్సీని దగా డీఎస్సీ అంటూ తప్పుడు ప్రచారం చేసి ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎస్సీలో నియమితు లైన ఉపాధ్యాయులు మంగళవారం కైకలూరులో ర్యాలీ నిర్వహించి తాలుకా సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉపాధ్యాయు లు ఎస్.రాధారాణి, ధర్మరాజుల సాయిరాం మాట్లాడుతూ అసత్య ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేలా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాలు పాటు కుటుంబాలకు దూరంగా ఉండి శిక్షణ తీసుకుని కష్టపడి ఉద్యోగాలు సంపాదించామన్నారు. ప్రభుత్వం పెద్దఎత్తున డీఎస్సీ నియామకం చేస్తే అభినందించాల్సిందిపోయి ఆరోపణలు చేయడం తగద న్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు చిట్టూరి చంద్రశేఖర్, ఎం.రవి శంకర్, ఎన్.భాస్కరవర్మ డీఎస్సీపై ఆరోపణలను ఖండించారు. విపక్షాల వైఖరి మార్చుకోవాలని, ఉపాధ్యాయులంతా కుటుంబాలతో సహా రోడ్డెక్కా ల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. డీఎస్సీ అభ్యర్థులకు తమ యూనియన్లన్నీ అండగా ఉంటాయని స్పష్టం చేశారు.