ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ABN , Publish Date - May 10 , 2026 | 12:31 AM
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌక ర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామ నారా యణరెడ్డి తెలిపారు.
ద్వారకాతిరుమలలో రూ.29 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభం
ద్వారకాతిరుమల, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌక ర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామ నారా యణరెడ్డి తెలిపారు. ద్వారకాతిరుమలలో భక్తుల సౌకర్యార్థ్యం అధునాతన సౌకర్యా లతో నూతనంగా రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూకాంప్లెక్స్‌ను, రూ.12 కోట్లతో నిర్మించిన అనివేటి మండపం ఫేజ్–2ను, రూ.4.50 కోట్లతో నిర్మించిన శివదేవుని ఆలయ ఐదు అంతస్తుల రాజగోపురాన్ని శనివారం మంత్రి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజుతో కలసి ప్రారంభించారు. విశాలమైన అనివేటి మండపం, అందులోని శిల్పా కృతులను పరిశీలించి మంత్రి అభినందిం చారు. ఆలయ విస్తీర్ణం, ఉపాలయాలు, ఆలయం మ్యాప్, భక్తులకు అందే సౌకర్యాలను ఆయన ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. సామాన్య భక్తులకు సైతం ఏ ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆలయ ఆవరణలోనే మెడికల్ క్యాంపును నిర్వహించాలని సూచించారు. తొలుత వేంకటేశ్వరస్వామిని మంత్రి, ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు, ఈవో త్రినాథరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు స్వామి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం అందజేశారు. అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈవోలు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జేసీ అభిషేక్ గౌడ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ట్రస్టుబోర్డు సభ్యులు పాల్గొన్నారు.