Share News

ఎమ్మెల్యే గారి తాలూకా..!

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:12 AM

జిల్లాలోని ఓ పీహెచ్‌సీకి రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా నియమితులైన ఒకరు నిబంధనలకు విరుద్దంగా ఏలూరు అర్బన్‌ పీహెచ్‌సీలో పనిచేస్తున్న విషయం జిల్లా అధికారుల తనిఖీల్లో బయట పడింది.

ఎమ్మెల్యే గారి తాలూకా..!

తప్పులు చేసి తప్పించుకునే మార్గం

ప్రముఖులతో పరిచయాలు.. ఫొటోలను చూపిస్తూ బెదిరింపులు

ఎమ్మెల్యే ఆఫీసు నుంచి మాట్లాడతారంటూ ఫోన్లు

వైద్య ఆరోగ్య శాఖలో వింత స్థితి

జిల్లాలోని ఓ పీహెచ్‌సీకి రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా నియమితులైన ఒకరు నిబంధనలకు విరుద్దంగా ఏలూరు అర్బన్‌ పీహెచ్‌సీలో పనిచేస్తున్న విషయం జిల్లా అధికారుల తనిఖీల్లో బయట పడింది. సంబంధిత వైద్యాధికారి మరిన్ని అవకతవకలకు పాల్పడినట్టు ఎన్‌హెచ్‌ఎం అధికారి విచారణలో రుజువైంది. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, జూన్‌, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ వైద్యుడు నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌/ మాన్యువల్‌ అటెండెన్సులో పలు అవకతవకలను ధ్రువీకరించారు. అయితే కేవలం షోకాజ్‌ నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. చర్యలకు వెనుకాడుతుండటం వెనుక తాను ఓ ఎమ్మెల్యే తాలూకా అంటూ జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఏలూరు అర్బన్‌, జనవరి 6 (ఆంధ్ర జ్యోతి):జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొందరు వైద్యాధికారులు, పలువురు ఉద్యోగులు ఉన్నతస్థాయి వ్యక్తులు, ప్రజా ప్రతినిధుల రికమండేషన్ల మాటున విధులకు హాజరు కావడం లేదు. ఒకరిద్దరైతే ముఖ్యమంత్రితో పరిచయం వున్నట్టు ఫొటోలను చూపించి జిల్లా అధికారులనే బురిడీ కొట్టించి ఉద్యోగ విధుల్లో లబ్ధి పొందుతున్నారు. మరికొంద రు ఎమ్మెల్యేల తాలూకా అంటూ ఇతరుల తో ఫోన్లు చేయించుకుని మినహాయింపు లతో కాలం గడుపుతున్నారు. ఇక పీహెచ్‌ సీలకు నియమితులైన వైద్యాధికారుల్లో కొందరు వాస్తవ పనిస్థానాల్లో కాకుండా వేరే పీహెచ్‌సీలకు డిప్యుటేషన్లపై వెళ్లడా నికి జారీ అవుతున్న ఉత్తర్వుల వెనుక ఫలానా ఎమ్మెల్యే తాలూకా అంటూ ఎవరో వ్యక్తుల నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయా నికి ఫోన్లు చేయించడం, ఆ వెంటనే పను లు జరిగిపోవడం బహిరంగ రహస్యమని తెలుస్తోంది. నిజానికి ఎమ్మెల్యేలు ఎవరూ ఫోన్లు చేయకపోయినా, వారి హోదాను, పేర్లను వినియోగించుకుని కార్యాలయం లో పలువురు ఫైరవీలు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. వివిధ ఆరోగ్య పథకాల అమలు, పర్యవేక్షణ, డేటా సేకరణకు గెజి టెడ్‌ ర్యాంకు అధికారుల సేవలను మాత్ర మే వినియోగించుకోవాలి. ఎక్కడా మెడి కల్‌ ఆఫీసర్లను నియమించవద్దని స్పష్టం చేసినా పట్టించుకునేవారే కరవయ్యారు.

చర్యలు తీసుకునేందుకు..

ఓ ఉద్యోగ సంఘ నాయకుడైతే సీఎం తో తీయించుకున్న ఫొటోను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల వద్ద ప్రదర్శిస్తూ వివిధ విభాగాల ఉద్యోగుల డిప్యుటేషన్లు, ఇతర పనులను ఓ రకంగా బెదిరించి మరీ చేయించుకున్నారు. వాస్తవానికి ఈ ఫొటోలు నిజంగా తీయించుకున్నవేనా లేక మార్ఫింగ్‌ చేసినవా అనేది తెలియదు. ఒకవేళ ఉన్నత స్థాయి వ్యక్తులతోవున్న ఫొటోలను చూసి నిబంధనలకు విరుద్దంగా డిప్యుటేషన్లు వేసేయడమేంటని వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరించి

పీహెచ్‌సీలకు నియమితులైన వారిలో ఏ ఒక్కరినీ ఇతర ప్రోగ్రాంలకు వినియో గించుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా సెలవు పెడితే సంబంధిత రోజుల్లో విధుల నిర్వహణకు నలుగురు రిజర్వ్‌ మెడికల్‌ ఆఫీసర్లను నియమించింది. ఏదైనా అత్యవసరమై డిప్యుటేషన్లు వేయాల్సి వస్తే ముందుగా తమ అనుమతి తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్న తాధికారులు ఆదేశించారు. కానీ ఈ ఆదేశాలు జిల్లాలో అమలు కావడం లేదు. ఇద్దరు వైద్యాధికారులు పని చేయాల్సిన పీహెచ్‌సీల్లో ఎవరైనా సెలవు పెడితే రిజర్వ్‌ మెడికల్‌ ఆఫీసర్లను పంపకుండా ఇతర పీహెచ్‌సీల నుంచి విధులు నిర్వర్తించేలా జిల్లా అధికారులకు తెలియజేయకుం డానే నియమిస్తున్నారు. ఇదే పరిస్థితి వివిధ విభాగాల ఉద్యోగుల్లోనూ ఉంది.

Updated Date - Jan 07 , 2026 | 01:12 AM