ట్రిపుల్ ఐటీలో నీటికష్టాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:50 AM
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులను నీటి సమస్య వేధిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే సరఫరా
8,700 మంది విద్యార్థులు, వెయ్యి మంది సిబ్బంది, అధ్యాపకుల పాట్లు
(నూజివీడు టౌన్–ఆంధ్రజ్యోతి)
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులను నీటి సమస్య వేధిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుంది. ఆరేళ్ల ఇంటి గ్రేటెడ్ ఇంజ నీరింగ్ విద్యను 6,500 మంది, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లకు చెందిన మరో 2,200 మంది ఇక్కడ రెసిడెన్షియల్ విధానంలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరి విద్యా బోధనలు, ఇతర అవసరాలు చూసేందుకు మరో వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉంటారు. వీరికి నూజివీడు మున్సిపాలిటీ నుంచి నీరు సరఫరా అవుతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున మాత్రమే నీటిని సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆ రెండు గంటల్లోనే తమ అవసరాలను తీర్చుకోవాలి. బాలికల వసతి గృహం లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడంతో నీటి ఎద్దడి సమస్య బయటపడింది. సెలవు రోజుల్లో నీటి సరఫరాను ఉదయం, సా యంత్రం గంట చొప్పున మాత్ర మే ఇస్తున్నారని చెబుతున్నారు. ఫలితంగా విద్యార్థులు కాలకృత్యాలు బలవం తంగా ఆపుకోవాల్సిన దుస్థితి. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి మరింత జఠిలం కానుంది. మున్సిపాలిటీకి నీటిని సర ఫరా చేసే కృష్ణ జలాలు తరలింపు పథకం తరచూ మరమ్మతులకు గురికావడంతో పట్టణానికి రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. విజయవాడ నుంచి నూజివీడుకు నీటిని పం పించేందుకు మోటార్లను వినియోగిస్తుండ డంతో విద్యుత్ బిల్లులు రూపేణ ట్రాన్స్‌కోకు మున్సిపాలిటీ భారీగా బకాయిలు పడింది. మరోవైపు ట్రిపుల్ ఐటీ నుంచి ఆస్తి, నీటి పన్ను రూపేణ మున్సిపాలిటీకి రూ.మూడున్నర కోట్ల వరకు చెల్లించాలి. ఇవి వస్తే విద్యుత్ బకాయి లు తీర్చవచ్చని ఆశతో మున్సిపాలిటీ వుంది. దీనిపై పలుమార్లు అక్కడి అధికారులను మున్సిపల్ అధికారులు కలిశారు. ఈ పరిస్థి తుల్లో మున్ముందు విద్యుత్ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆ ప్రభావం మున్సిపాలి టీతోపాటు ట్రిపుల్ ఐటీపైన పడే ప్రమాదం పొంచి ఉంది.
ఉన్నత విద్యా శాఖ దృష్టి సారించాలి
ట్రిపుల్ ఐటీ పరిస్థితులపై ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.