పక్షుల కేంద్రం చెరువులోకి నీటి తోడకం
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:33 AM
వేసవి ఎండలతో కొల్లేరు సరస్సులో నీరు అడుగంటు తోంది. దీంతో అటవీశాఖ అధికారులు పక్షుల కేంద్రంలో నీటిని పెంచేందుకు ఆయిల్ ఇంజన్లతో సరస్సులో నీటిని చెరువులోకి తోడుతున్నారు.
కైకలూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి):వేసవి ఎండలతో కొల్లేరు సరస్సులో నీరు అడుగంటు తోంది. దీంతో అటవీశాఖ అధికారులు పక్షుల కేంద్రంలో నీటిని పెంచేందుకు ఆయిల్ ఇంజన్లతో సరస్సులో నీటిని చెరువులోకి తోడుతున్నారు. ఏటా వేసవి ఎద్దడికి కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం అడుగంటిపోతోంది. ఈ నేపథ్యం లో ఈ ఏడాది ఎంతోకొంత నీరు నిల్వ ఉంచేందుకు ఉన్నతాధికారుల అనుమతులతో అటవీశాఖ రేంజర్ రామలింగాచార్యులు ఎనిమిది ఆయిల్ ఇంజన్లతో వారం రోజులుగా నిరంతరం పోల్‌రాజ్ డ్రెయిన్, సరస్సులోని నీటిని తోడిస్తున్నారు. పక్షుల కేంద్రం అడుగంటిన సమ యంలో పక్షులు చిన్న చిన్న నీటికుంటల్లో సేద తీరుతుంటాయి. ఇప్పటికే విదేశీ పక్షులు తిరుగుముఖం పట్టగా వయస్సు మళ్లినవి, ఇటీవల సంతానోత్పత్తి చేసిన పక్షులు మాత్రమే వేసవిలో ఇక్కడే ఉండిపోతాయి. ఈ క్రమంలో వాటికి ఇబ్బంది లేకుండా నీటిని పక్షుల కేంద్రం చెరువులోకి తోడుతున్నారు.