గోదావరిలో తేలిన ఇసుక తిన్నెలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:44 AM
నిత్యం నీటితో నిండే గోదావరి వేసవి కాలం వచ్చే సరికి గోదావరిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతుంది
ఆచంట, మార్చి10(ఆంధ్రజ్యోతి):నిత్యం నీటితో నిండే గోదావరి వేసవి కాలం వచ్చే సరికి గోదావరిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతుంది. నియోజకవర్గంలోని కోడేరు, కరుగోరుమిల్లి, నడిపూడి వంటి చోట్ల గోదావరి ప్రస్తుతం నీటి మట్టం బాగా తగ్గి ఇసుక తిన్నెలు దర్శనం ఇస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో దాని నిమిత్తం బ్యాంక్ కెనాల్‌లో కూడా నీటి మట్టం ఒక్కసారిగా తగ్గిపోతున్నది. దీని కారణంగానే దాళ్వా సాగు సైతం వంతులవారి విఽధానం అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలో గోదావరి నిత్యం వరద నీటితో కలకల్లాడుతుంటాది. జనవరి వచ్చిన తరువాత గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా తగ్గడంతో ఇసుక తిన్నెలతోనే గోదావరి కనపడుతుంది.