చెత్తశుద్ధి ఏదీ
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:49 AM
పట్టణాల్లో చెత్త కొండలు కనిపించకుండా చేసేం దుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
పట్టణాల్లో చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటులో జాప్యం
తణుకులో మాత్రమే ఏర్పాటు
తాడేపల్లిగూడెం స్థల సేకరణ పూర్తి
మిగతా కొలిక్కిరాని స్థల సేకరణ
భీమవరం టౌన్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో చెత్త కొండలు కనిపించకుండా చేసేం దుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తడి, పొడి వ్యర్థాలను వేరుచేసి శాస్త్రీయంగా నిర్వహిం చే కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. జిల్లాలో రూ.32 కోట్లతో చెత్త నిర్వహణ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. తణుకు పట్టణంలో ప్లాంట్ ఏర్పాట్లు పూర్తి కావస్తుండగా తాడేపల్లిగూడెంలో స్థల సేకరణ ఒక కొలిక్కి వచ్చింది. మిగిలిన చోట్ల స్థల సేకరణ దశలోనే అధికారులు ఉన్నారు. జాప్యం జరిగితే నిధులు వెనక్కి మళ్లిపోయే ప్రమాదం ఉంది. మార్చిలోపు చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు కాకుంటే నిధులు మురిగిపోతాయి.
ఒకే చోటికి తడి, పొడి చెత్త
మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తయ్యే చెత్తను ఒకే చోటకు తరలించి డంపింగ్ చేయడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, వాటిని ప్రత్యేక కేంద్రాల్లో శుద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావ డమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతు న్నారు. జిల్లాలోని పలు పట్టణాల్లో ఇప్పటికే పను లు ప్రారంభమయ్యాయి. తడి చెత్త నుంచి సేంద్రి య ఎరువును తయారు చేయడంతో పాటు, పొడి చెత్తలోని ప్లాస్టిక్, కాగితం, ఇతర పునర్వినియోగ పదార్థాలను వేరు చేసి సంబంధిత పరిశ్రమలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జనాభా ఆధారంగా..
భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు తదితర పట్టణాల్లో చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తు న్నారు. పట్టణ జనాభా, రోజువారీగా ఉత్పత్తయ్యే చెత్త పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రాల సామర్థ్యాన్ని నిర్ణయిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత సేకరించిన వ్యర్థాలను ఆయా కేంద్రాలకు తరలించేలా పారి శుధ్య వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు.
స్థల సేకరణ సమస్య..
బీమవరం మునిసిపాల్టీకి రూ.10 కోట్లు మం జూరు కాగా సుమారు 6 ఎకరాలు అవసరం. స్థలం సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపాల్టీకి కూడా రూ.10 కోట్లు మంజూరైంది. 4 ఎకరాల స్థలం అధికారులు గుర్తించినా ఎన్నికల కోడ్ కారణంగా అప్పగించలేదని తెలుస్తోంది. తణుకు మునిసిపాల్టీకి రూ.5 కోట్లు మంజూరు కాగా స్థల సేకరణ సంబంధిత ప్లాట్ ఫాం, యంత్రాల ఏర్పాటు పనులుపూర్తయ్యాయి. త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నారు. పాలకొల్లుమునిసిపాల్లీకి రూ.5 కోట్లు మంజూరు కాగా 2 ఎకరాల స్థలం సేకరించారు. నరసాపురం మునిసిపాల్టీకి రూ 4 కోట్లు మంజూరు కావలసి ఉంది. ఇక్కడ 1.65 సెంట్ల స్థలం అవసరమైనా సేకరణపై జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి ఆకివీడు నగర పంచాయితీలో ఉంది. ఇక్కడకు రూ 3 కోట్లు మంజూరైంది. వచ్చే మార్చిలోగా పనులు చేపట్టకపోతే మునిసిపాల్టీలకు కేటాయించిన నిధులు వెనక్కివెళ్లిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక అధికారులు చర్యలపైనే ఆధార పండి ఉంది.