Share News

వార్డుల పెంపునకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - May 18 , 2026 | 12:03 AM

నూజివీడు మున్సిపల్‌ పరిధిలో వార్డుల పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఆదివారం పబ్లిష్‌ చేశారు.

వార్డుల పెంపునకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌
జంగారెడ్డిగూడెంలో వార్డుల విభజన ముసాయిదాను ప్రతిని నోటీసుబోర్డు లో పెడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ కె.వి.రమణ

నూజివీడులో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పబ్లిష్‌ చేస్తున్న అధికారులు

నూజివీడు టౌన్‌, మే 17(ఆంధ్రజ్యోతి) : నూజివీడు మున్సిపల్‌ పరిధిలో వార్డుల పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఆదివారం పబ్లిష్‌ చేశారు. ఇప్పటి వరకు నూజివీడు మున్సిపల్‌ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటిని మరో నాలుగు వార్డులు పెంచి మొత్తం 36 వార్డులుగా ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల పెంపునకు సంబంధించి సరిహద్దుల నిర్ధారణ తదితర వివరాలతో కమిషనర్‌ పీరయ్య ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యా లయాలు, వార్డు సచివాలయాలలో నోటిఫికేషన్‌ పబ్లిష్‌ చేశా రు. డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌, వార్డుల పెంపుపై అభ్యంతరాలు ఉం టే ఈనెల 24వ తేదీ లోపు తెలపాలని కమిషనర్‌ కోరారు.

24 వరకు అభ్యంతరాలు స్వీకరణ

జంగారెడ్డిగూడెం,మే 17(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం ఉన్న 29 వార్డులను 32 వార్డులుగా పునర్విభజిస్తు న్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ కె.వి.రమణ ఆదివారం విలే కరుల సమావేశంలో తెలిపారు. పట్టణంలో సహజసిద్ధంగా ఉన్న భౌగోళిక పరిస్థితులను మార్చకుండా క్లాక్‌ వైజ్‌గా మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఒకటవ వార్డు ఎక్కడ ప్రారంభం అవుతుందో తిరిగి చివరి వార్డు 32 కూడా ఒకటో వార్డు వద్దనే ముగుస్తుందని తెలిపారు. ప్రతి వార్డులో 1,500 నుంచి 1,550 మంది ఓటర్లు,రెండు వేల మంది జనాభా ఉండేలా ముసాయిదా సిద్ధం చేసినట్టు తెలి పారు. సిద్ధమైన ముసాయిదా ప్రతులను స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద, పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యా లయాల్లోని నోటీసు బోర్డుల వద్ద ఉంచుతామన్నారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు,సలహాలు, సూచనలు 18 నుంచి 24వ తేదీ వరకు లిఖితపూర్వకంగా తమకు తెలిపే నిబంధనల ప్రకారం మార్పు, చేర్పులు చేసి తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:03 AM