యుద్ధ మంటలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:31 AM
మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభం కావడంతో అందోళన వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్‌పై పడింది.
స్టాక్ మార్కెట్‌లు కుదేల్
బంగారం, చమురు ధరల పరుగు
పలు విమానాలు రద్దు
అయిన వారి కోసం బంధువుల ఆందోళన
స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు
మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభం కావడంతో అందోళన వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్‌పై పడింది. స్టాక్ మార్కెట్‌లు కుదేలయ్యాయి. బంగారం, వెండి పరుగులు తీశాయి. అంతర్జాతీయంగా చమురు రవాణా నిలిచిపోవడంతో మళ్లీ ధరలు పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వారు అక్కడ ఎలా ఉన్నారో ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.
– నరసాపురం, ఆంధ్రజ్యోతి
కుప్పకూలిన మార్కెట్‌లు...
యుద్ధ వాతావరణంతో ఊహించిన విధంగానే సోమ వారం స్టాక్ మార్కెట్ లు కుదేలయ్యాయి. జిల్లా మదుపుదా రులు భారీగా నష్టపోయారు. కొందరు భయ ంతో ఉన్న స్టాక్‌ను అమ్ముకుని నష్టాలను మూటగ ట్టుకున్నారు. అన్ని స్టాక్‌లు రెడ్‌మార్క్‌లోనే ఉండటంతో పెట్టిన పెట్టుబడుల్లో పది శాతానికి పైగా అవిరయ్యాయి. జిల్లాలోని మదుపుదారుల సంపద నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పసిడి, వెండి పరుగు
యుద్ధ ప్రభావం పసిడి, వెండిపై భారీగానే చూపి ంది. తగ్గిన ధరలు మళ్లీ ఊపందుకు న్నాయి. సోమవారం గ్రాము ఆర్నమెంట్ బంగారం రూ.15810కి చేరింది. శనివారం ధరతో పొలిస్తే గ్రాము కు రూ.500 పెరిగింది. 24 క్యారెట్ల బంగా రానికి వస్తే శనివారం 16,500 ఉండగా... ఆ ధర సోమవారం నాటికి రూ.17265కు చేరింది. అంటే గ్రాముకు సుమారు రూ. 700 పెరిగింది. వెండి శనివారం కిలో రూ.2.86 లక్షలు ఉండగా... సోమవారం మార్కెట్‌లో రూ.3 నుంచి రూ.3.05 లక్షల వరకు పెరిగింది. రాత్రి అమెరికా మార్కె ట్‌లు ప్రారంభమైన తరువాత ఈ ధరలు ఏ మేరకు పెరుగుతాయన్నది సస్పెన్స్‌గా మారింది. యుద్ధ వాతావరణం కొనసాగే వరకు వీటి ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ లేదంటున్నారు.
రద్దయిన విమానాలు
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేశారు. దీంతో అంతర్జాతీయ విమానాలు చాలా రద్దయ్యాయి. టిక్కెట్‌లు బుక్ చేసుకున్న వారంతా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. గల్ఫ్ నుంచి జిల్లాకు వద్దామని సిద్ధమైన వారంతా యుద్ధంతో అక్కడే ఉండిపోయారు. ఇటు శెలవులకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనా విమానాలు లేకపోవడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇలా ఉమ్మడి పశ్చిమలో ప్రయాణాలు రద్దు అయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అత్యధికంగా గల్ఫ్ వెళ్లే వారు ఉన్నారు. ఆక్కడి నుంచి సెలవులకు వచ్చిన వారు విమానాలు లేకపోవడంతో ఎయిర్ పోర్టుల్లోనే ఆగిపోయారు. వీరి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతు న్నారు. ఎప్పటికికప్పుడు ఫోన్‌లు చేసి వివరాలు సేకరిస్తున్నారు
ప్రజల్లో ధరల భయం..
యుద్ధ ప్రభావంతో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న భయం జిల్లా వాసుల్లో నెలకొంది. ఇప్పటికే నిత్యావసర ధరలు చుక్కలంటాయి. ఈ తరుణంలో డీజిల్ ధరలు పెరిగితే వీటి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గ్యాస్ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ భయం జిల్లావాసుల్ని వెంటాడుతున్నది.