పీఎం లంకకు రక్షణ
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:39 PM
ఒక్కప్పుడు పీఎం లంకకు సముద్రం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది.
సముద్ర కోతకు అడ్డుకట్టగా గోడ
నిర్మాణంలో కొత్త టెక్నాలజీ
దేశంలో నాల్గవది.. ఇప్పటి వరకు కేరళ, ఒడిశా రాష్ర్టాల్లో నిర్మాణం
ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి
నరసాపురం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఒక్కప్పుడు పీఎం లంకకు సముద్రం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. సముద్రం వరకు సరుగుడు, కొబ్బరి తోటలు ఉండేవి. కాలక్రమేనా గ్రామానికి అర కిలోమీటర్ దూరానికి కడలి చొచ్చుకొచ్చింది. దీంతో ఏదో ఒకరోజు తమ గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఈ సమస్యపై దృష్టిపెట్టారు. సముద్ర కోత అడ్డుకట్టకు పరిశోధనలు జరిగాయి. చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు రక్షణ రంగానికి చెందిన నిపుణులు వచ్చి అధ్యయనం చేశారు. చెన్నై ఐఐటీ నిపుణుల సూచనల్ని అనుసరించి గోడ నిర్మించాలని భావిం చారు. ఇప్పటికే ఈ తరహా గోడ నిర్మాణాలు విదేశాల్లో ఉన్నాయి. దేశంలో కేరళ, ఓడిశాల్లో కొన్ని చోట్ల నిర్మించారు. అక్కడ మంచి ఫలితాలు చూశారు. ఇదే టెక్నాలజీ వినియోగించి పీఎం లంక వద్ద కూడా కోత నివారణకు బ్రేక్ వేయాలని భావించారు. తొలి విడ తగా 1000 మీటర్ల మేర గోడ నిర్మాణం చేపట్టారు. ఎక్కడ కోత ఎక్కువుగా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. భూమి అడుగు భాగం నుంచి నిర్మాణ పనులు చేపట్టారు. రాళ్లు కదలిపోకుండా ఒక ప్రత్యేక మైన తాళ్లతో కట్టి వాటిలో రాళ్లు, ఇసుకను అమర్చి ఆడుగుభాగం నుంచి వాల్ నిర్మిస్తున్నారు. సాధార ణంగా సముద్ర కోతకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద పెద్ద సిమెంట్ రాళ్లను వేస్తుంటారు. ఎక్కువుగా పోర్టుల్లో రాళ్లు వేస్తుంటారు.
ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి
ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. ఇది డెలైట్ ఆర్థిక సహకారంతో చేస్తున్నారు. సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రూ.13 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1000 మీటర్ల మేర గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 650 మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 350 మీటర్ల పనుల్ని ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెన్నై ఐఐటీ నిపుణులు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గ్రామానికి వచ్చినప్పుడు పనుల్ని పరిశీలించారు. ప్రస్తుతం చేస్తున్న పనుల వల్ల ఏ మేరకు ఆడ్డుకట్ట పడుతుందన్న విష యాన్ని నిపుణుల్ని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మరికొన్ని మీటర్లు పెంచాలని సూచించారు.