Share News

గుండెను కాపాడుకుందాం : ఏలూరు డీఎస్పీ

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:13 AM

వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు విస్తృతమవుతుండడం కుటుంబ, ఆర్థికవ్యవస్థలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

గుండెను కాపాడుకుందాం : ఏలూరు డీఎస్పీ
వాక్‌థాన్‌లో పాల్గొన్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, ఆయుష్‌ వైద్యనిపుణులు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు విస్తృతమవుతుండడం కుటుంబ, ఆర్థికవ్యవస్థలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్‌ కార్డియాలజీ డేని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఆయుష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే వాక్‌థాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత గుండెవ్యాధుల బారిన పడుతుండడం దేశ ఆర్థికవ్యవస్థను, ముఖ్యంగా ఉత్పత్తిరంగాన్ని తీవ్ర ప్రభావితంచేస్తుందన్నారు. వాక్‌థాన్‌ అనంతరం ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ దశరథ్‌ బొప్పన మాట్లాడుతూ అన్ని వయస్సుల వారు వారానికి ఐదు రోజులపాటు కనీసం 20 నిమిషాలు చొప్పున వేగవంతమైన నడక, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర, స్ట్రెస్‌కు దూరంగా ఉండాలన్నారు. ఆసుపత్రినుంచి ప్రారంభమైన వాక్‌థాన్‌ పత్తేబాద శివాలయం, ఆర్‌ఆర్‌ పేట, విజయవిహార్‌ సెంటర్‌, అశోక్‌నగర్‌లమీదుగా కొనసాగింది. ఆయుష్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ వై.రమేష్‌బాబు, వైస్‌చైర్మన్‌ పి.ఎస్‌.శ్రీనివాస్‌ చౌదరి, మేనేజర్‌ కాశీనాథ్‌ జాస్తి, వైద్యులు డాక్టర్‌ పార్థసారథి, శానం విజయమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:13 AM