Share News

పనిభారం తగ్గించండి..

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:41 AM

విధి నిర్వహణ లో పెరుగుతున్న పని భారం తగ్గించాలని కోరుతూ సోమవారం భోజన విరామ సమయంలో జిల్లావ్యాప్తంగా గ్రామ వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.

పనిభారం తగ్గించండి..
ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న వీఆర్వోలు

ఒత్తిడి తాళలేక కొందరు ఆత్మహత్యలు..

ఇలా అయితే సర్వే చేయలేం..

వీఆర్వోల ఆవేదన.. నిరసనలు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణ లో పెరుగుతున్న పని భారం తగ్గించాలని కోరుతూ సోమవారం భోజన విరామ సమయంలో జిల్లావ్యాప్తంగా గ్రామ వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు చెప్పిన పనులు సకాలంలో పూర్తి చేయలేక కొందరు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని, కానీ తమపై విపరీతంగా పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే ప్రక్రి యను వంద రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్‌ విధించడం తగ దంటూ అధికారులు తీరుపై మండిపడుతున్నారు. సర్వేను హడా వుడిగా చేయడం వల్ల తప్పులు వచ్చే ప్రమాదం ఉందని ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో

వీఆర్‌ఏల కొరత తీవ్రంగా ఉందని, వీఆర్వోల నియామకాలు జరపకపోవడం వల్ల పని భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 700 మందికి పైగా వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలో పనులు, ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు ఇలా ప్రతి పనికీ వీఆర్వోలనే ఉపయోగిస్తున్నారని దీంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మనుషులమేనని, ఎన్ని పనులు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఒత్తిడి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, వీఆర్వోల సాధకబాధకాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళదామని తాము అనుకుంటే కొంతమంది ముఖ్యమంత్రికి వీఆర్వోలపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సమయంలోపు బయోమెట్రిక్‌ వేయకపోతే సెలవుగా నిర్ధారణ

వీఆర్వోలు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని, సచివాలయాల్లో బయోమెట్రిక్‌ వేయడం లేదని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. తాము బయోమెట్రిక్‌ వేయపోతే సెలవుగా నిర్ధారిస్తున్నారని వాపోతున్నారు. ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు రెండో సారి, సాయంత్రం 5 గంటల తర్వాత మరొకసారి బయోమెట్రిక్‌ వేయపోతే సెలవుగా నిర్ధారిస్తున్నారని వాపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వీఆర్వోలు ఖాళీ లేకుండా విధులు నిర్వహిస్తున్న తమపై అధికారులు వేధింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించాలన్న ఉద్దేశం తమకు లేదని తేల్చిచెబుతున్నారు. రీసర్వే కోసం వీఆర్వోలు పెడుతున్న ఖర్చులను వెంటనే చెల్లించాలని సర్వే వంద రోజుల్లోనే పూర్తి చేయాలన్న నిబంధన సడలించాలని వీఆర్వోలు కోరుతున్నారు.

వేధింపులకు గురి చేయడం తగదు

గ్రామ రెవెన్యూ అధికారులను, అధికారులు వేధింపులకు గురి చేయడం తగదు. కిందిస్థాయిలో సమస్యలు తెలుసు కోకుండా హడావిడిగా పూర్తి చేయాలని వీఆర్వోలను ఒత్తిడి చేయడం సరికాదు. గత ప్రభుత్వంలో రీసర్వేలో జరిగిన వాస్తవాలను ప్రభుత్వానికి దూరం చేయాలని కొంత మంది అధికారులు కుట్రలు చేస్తున్నారు. సమస్యలు తెలుసుకోకుండా వీఆర్వోలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు చాలా మంది అందుబాటులో ఉండడం లేదు. ఆ సమస్యలు ఎవరూ పట్టించుకోకుండా వీఆర్వోలపై ఒత్తిడి చేయడం, సర్వే చేయకపోతే షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం దారుణం.

– భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు

Updated Date - Feb 17 , 2026 | 12:41 AM