Share News

పల్లెల్లో జోరు.. పట్టణాల్లో బేజారు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:37 AM

ఆరేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలపై పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.

పల్లెల్లో జోరు.. పట్టణాల్లో బేజారు!

మునిసిపాలిటీల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు.. 65 శాతానికి మించని పోలింగ్‌

పంచాయతీల్లో 76.42 శాతం నమోదు.. విలీన గ్రామాల వార్డుల్లోనూ భారీగా ఓటింగ్‌

ఆరేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలపై పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని తొలి విడత ఐదు మండలాల పరిధిలోని పంచాయతీల్లో 76.42 శాతం పోలింగ్‌ నమోదు కాగా, మున్సిపాలిటీల్లో మాత్రం ఓటింగ్‌ గణనీయంగా తగ్గింది. ఒక్క పాలకొల్లులోనే 69.52 శాతం మంది ఓటు వేశారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీల్లో 65 శాతానికి మించి పోలింగ్‌ జరగకపోవడం రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేసింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఓటు ద్వారానే సక్రమమైన పాలన సాధ్య మని ఎన్నికల సంఘం చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు అధికారులు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినా ఆశించిన ఫలితం కని పించలేదు. మరోవైపు అభ్యర్థులు కోట్ల రూపా యలు ఖర్చు చేసి, దాదాపు 80 నుంచి 85 శాతం మంది ఓటర్లకు సొమ్ములు పంపిణీ చేశారు. అయినప్పటికీ అత్యధిక వార్డుల్లో పోలింగ్‌ 65 శాతానికి మించకపోవడంతో అభ్య ర్థులు విస్తుపోతున్నారు. పట్టణ వార్డులతో పోలి స్తే మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వార్డు ల్లో అత్యధిక పోలింగ్‌ నమోదైంది. తాడేపల్లి గూడెం ఒకటో వార్డు ఎల్‌ అగ్రహారం గ్రామ పరిధిలో ఉంది. అక్కడ రెండు పోలింగ్‌ కేంద్రా లు ఉండగా, మొత్తం 2,041 మంది ఓటర్లకు గాను 1,711 మంది ఓటువేశారు. ఇక్కడ 83.83 శాతం పోలింగ్‌ నమోదైంది. అదే పట్టణ పరిధి లోని కొన్ని వార్డుల్లో మాత్రమే 70 శాతం ఓటిం గ్‌ జరగ్గా, అత్యధిక వార్డులు 60 నుంచి 65 శాతానికే పరిమితమయ్యాయి. భీమవరం మున్సిపాలిటీలో మొత్తం 62.71 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. పట్టణంలో విలీనమైన తాడేరు గ్రామ పరిధిలోని పదమూడో వార్డులో 83 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పాల కొల్లు మున్సిపాలిటీలోనూ గ్రామాల పరిధిలోని వార్డుల్లో అధిక శాతం, పట్టణ వార్డుల్లో తక్కువ పోలింగ్‌ జరిగింది.

తొందరపాటే కారణమా?

ఎన్నికల షెడ్యూల్‌ అనూహ్యంగా రావడం పోలింగ్‌ తగ్గడానికి ప్రధాన కారణమన్న చర్చ నడుస్తోంది. వార్డుల పునర్విభజనకు కనీసం వారం రోజుల వ్యవధి కూడా ఇవ్వలేదు. రెండు రోజుల్లో విభజన పూర్తిచేసి, ఒక రోజు అభ్యంతరాలు స్వీకరించి, నాలుగో రోజే జాబితా విడుదల చేశారు. దీనిపై అధికారులకు సైతం సరైన అవగాహన లేకుండాపోయింది. అభ్యర్థులు వార్డులపై పట్టు సాధించలేకపోయారు. సీనియర్లు ఓటర్లను ముందుగా గుర్తించి ఓటింగ్‌ జరిగేలా చూసుకోగా, కొత్తవారు పోలింగ్‌ నిర్వహణలో విఫలమయ్యారు.

బెడిసి కొట్టిన వ్యూహం

గతంలో మాదిరిగా ఓటర్లను పోలింగ్‌ కేంద్రా లకు తరలించి ఓటు వేయించే ప్రయత్నాలు ఈసారి జరగలేదు. తాయిలాలు ఇచ్చేశాం కాబట్టి ఓట్లు వేస్తారన్న అభ్యర్థుల ధీమా కాస్తా బెడిసికొట్టింది. దీనికితోడు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు రాకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గింది. ప్రస్తుత ఓటింగ్‌ సరళిని బట్టి కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఓటింగ్‌ పెరిగితే మెజారిటీ కూడా అదే స్థాయి లో ఉంటుందని కూటమి భావించగా, తమకు ఓట్లు పెరిగే అవకాశం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది.

Updated Date - Nov 28 , 2026 | 12:37 AM