Share News

అక్కడే ఉన్నారా.. లేరా?

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:32 AM

పారదర్శకంగా ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలనే లక్ష్యం తో భారత ఎన్నికల సంఘం అడుగులేస్తోంది. ఏటా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటరు, నమో దు, మార్పులు, చేర్పులను చేపడుతోం ది.

అక్కడే ఉన్నారా.. లేరా?
ఓటర్లు (ఫైల్‌)

చురుగ్గా ఓటర్ల మ్యాపింగ్‌

జిల్లాలో 73.86 శాతం నమోదు

పారదర్శక ఓటర్ల జాబితాలే లక్ష్యం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పారదర్శకంగా ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలనే లక్ష్యం తో భారత ఎన్నికల సంఘం అడుగులేస్తోంది. ఏటా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటరు, నమో దు, మార్పులు, చేర్పులను చేపడుతోం ది. ఈ ఏడాది ప్రత్యేక సవరణ ముందు జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తద్వారా స్థానికంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయనుంది.

జిల్లా వ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. క్షేత్రస్థాయిలో 23 ఏళ్ల నాటి జాబితాను ప్రస్తుత లిస్టుతో సరిపోల్చుతున్నారు. ఓటర్లు ఎక్కడున్నారు. ఎంతమంది ఉన్నారనేది పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 73.86 శాతం పూర్తయింది. 2025 ఓటర్ల జాబితా లెక్కల ప్రకా రం మొత్తం ఓటర్లు 16లక్షల 42వేల 879 మం ది ఓటర్లు ఉండగా 10లక్షల37వేల244 మంది ఓటర్లకు మ్యాపింగ్‌ను బూత్‌లెవెల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో)లు పూర్తి చేశారు. అత్యధికకంగా చింతలపూడిలోను, అత్యల్పంగా నూజివీడు నియోజకవర్గంలో మ్యాపింగ్‌ పూర్తి చేశారు.

18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులను స్వీకరించడంతో పాటు మరణించిన, శాశ్వత వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తారు.

2002 నాటి జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. అదే నియోజకవర్గంలో ఉన్నారా? వేరే చోటుకు మారారా... అనేది పరిశీలిస్తున్నారు.

40 ఏళ్ల వయస్సు దాటిన వారి పేర్లు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నాయా? లేదా చూపి మ్యాపింగ్‌ చేస్తున్నారు.

ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలోని వారిని స్థానికులుగా గుర్తించి.. మిగిలిన వారిన వలస ఓటర్లుగా భావిస్తున్నారు.

వలస ఓటర్లకు ఇతర కేంద్రాల్లో ఓటు హక్కు ఉన్నట్లైయితే ఆ వివరాలను సేకరిస్తున్నారు

పాత జాబితాలో పేరు ఉండి ప్రస్తుత జాబితాలో లేని వారి వివరాలను నమోదు చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:32 AM