ఓటర్ల జాబితాలు సిద్ధం
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:54 AM
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతు న్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీల) రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ కార్యాలయంలో ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
ఉమ్మడి పశ్చిమలో 48 మండలాల్లో ఎంపీటీసీల వారీగా జాబితాలు ప్రచురణ
ఏలూరు జిల్లాలో 27 మండలాల్లో 463 ఎంపీటీసీలు – 12,96,519 మంది ఓటర్లు
జిల్లాలో 27 జడ్పీటీసీల వారీగా ఓటర్లు జాబితా సిద్ధం
జడ్పీ, ఎంపీపీ ఎన్నికలకు సమాయత్తం
(ఏలూరుసిటీ–ఆంరఽధజ్యోతి)
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతు న్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీల) రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ కార్యాలయంలో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమలోని 48 మండలాలకు సంబంధించి జడ్పీటీసీల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవో, డీపీవో జీవీఎస్ మల్లికార్జునరావు, డిప్యూటీసీఈవో కె.భీమేశ్వర్ విడుదల చేశారు. 48 మండలాల్లోను ఈ జాబితాలను నోటీస్ బోర్డు లలో ప్రదర్శించారు. ఏలూరు జిల్లాలో 27 మండలాలు ఉండగా మొత్తం 12,96,519 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 6,35,768 మంది, మహిళా ఓటర్లు 6,60,708 వరకు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా పెదవేగి మండలంలో 76,794 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా వేలేరుపాడు మండలంలో 17,600 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు కొనసాగుతోంది. ఈనెల 14న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల, 19న పోలింగ్ కేంద్రాల తుదిజాబితాను ప్రచురణ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందిస్తారు. ఈ తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈనెల 21న రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపి స్తారు.