అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:29 AM
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించాలని సర్ అబ్జర్వర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సర్ అబ్జర్వర్ వేణుగోపాల్ రెడ్డి సమావేశం
భీమవరం టౌన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించాలని సర్ అబ్జర్వర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సూచించారు. కలెక్ట రేట్‌లో మంగళవారం ఈఆర్వోలు, పొలి టికల్ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, క్లెయిమ్స్ అభ్యం తరాల స్వీకరణ, వాటి పరిష్కార ప్రక్రియపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును సంబంధిత రికార్డులతో పరిశీలించి, అర్హత ఉన్న ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియ పూర్తి చేయడానికి మరోసారి గడువు ఉండదని అక్టోబర్ 2వ తేదీలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ నాగరాణి జిల్లాలో సర్ ప్రక్రియ ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో భీమ వరం, నరసాపురం, తాడేప ల్లిగూడెం, తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి, నియోజకవర్గాల ఈఆర్వోలు రాజకీయ పార్టీలకు చెందిన నాయ కులు పాల్గొన్నారు. అంత కుముందు వేణు గోపాల్ రెడ్డికి కలెక్టర్ నాగరాణి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న చర్యలు, నోటీసుల పంపిణీ, పెండింగ్ అంశాలు, సం బంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
గోదావరి పుష్కరాలపై సీఎం కాన్ఫరెన్స్
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాల యం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, పుష్కరాల ప్రత్యేక అధి కారి, ప్రభుత్వ కార్యదర్శులతో మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా సమీక్షించారుపుష్కర ఘాట్లు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత, తదితర ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని సూచించారు. మంజూరైన పనులను త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ హాజరయ్యారు