Share News

లెక్క తేలింది

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:07 AM

జంగారెడ్డిగూడెం పురపా లక సంఘం పరిధిలోని 32 వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాను మున్సి పల్‌ కమిషనర్‌ కెవి.రమణ సోమవారం మున్సి పల్‌ కార్యాలయ నోటీసుబోర్డులో ప్రచురించారు.

లెక్క తేలింది

జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా

జంగారెడ్డిగూడెం/నూజివీడు టౌన్‌, సెప్టెం బరు 21(ఆంధ్రజ్యోతి):జంగారెడ్డిగూడెం పురపా లక సంఘం పరిధిలోని 32 వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాను మున్సి పల్‌ కమిషనర్‌ కెవి.రమణ సోమవారం మున్సి పల్‌ కార్యాలయ నోటీసుబోర్డులో ప్రచురించారు. పట్టణంలో ఎస్టీ ఓటర్లు 1,190 మంది ఉండగా, ఎస్సీ 5,930, బీసీ 19,210, జనరల్‌ ఓటర్లు 22,133 మంది ఉన్నారు. మొత్తం పట్టణంలో 48,463 ఓటర్లు ఉండగా పురుషులు 23,409, మహిళలు 25,025, ఇతరులు 29 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తి కావడంతో రిజర్వేషన్ల ప్రక్రియ ను మున్సిపల్‌ శాఖ త్వరలో పూర్తి చేయనుంది.

నూజివీడు మున్సిపల్‌ పరిధిలో ఎలకో్ట్రరల్‌ పబ్లికేషన్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మునిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య 32 నుంచి 36 వార్డులకు పెరగగా మొత్తం 42,952 ఓటర్లు ఉన్నారు. వీరిలో 20,521 పురుషులు, 22,425 మహిళలు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. జనరల్‌ కేటగిరీలో 14,341 మంది ఉండగా పురుషులు 7,033, మహిళలు 7,306, ఇతరులు ఇద్దరు, ఎస్సీ కేటగిరి 7,691 మందిలో పురుషులు 3,531, మహిళలు 4,159, ఇతరులు ఒకరు, బీసీ విభాగంలో 19,054 మందికి పురుషులు 9,070, మహిళలు 9,981, ఇతరులు ముగ్గురు, ఎస్టీ విభాగంలో 1,866 మంది ఉండగా పురుషులు 887, మహిళలు 979 ఉన్నారు.

నేడు నగర పాలక సంస్థ ఓటర్ల జాబితా ప్రచురణ

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఈనెల 22న ప్రచురిస్తామని కమిషనర్‌ భానుప్రతాప్‌ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఓటర్ల జాబితాను నియోజకవర్గంలో ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శిస్తామన్నారు. నగర పాలక సంస్థ, తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో, సచివాలయాల్లో అందు బాటు లో ఉంటుందని ప్రజలు పరిశీలించుకోవచ్చని తెలిపారు.

Updated Date - Sep 22 , 2026 | 01:08 AM