సర్‌లో లెక్కతేలిన ఓటర్లు 13,89,592
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:40 AM
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సర్వే (సర్) గడువు ముగిసిన తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు శుక్రవారం ప్రకటించారు.
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
జిల్లాలో గతం కంటే తగ్గిన ఓటర్లు ..85,444
చనిపోయిన ఓటర్లు 43,746 మంది..
తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం
నియోజకవర్గాల్లో ఎక్కువ
శాశ్వతంగా వలస వెళ్లినవారు 22,131..
డబుల్ ఎంట్రీ 15,676 మంది
భీమవరం టౌన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సర్వే (సర్) గడువు ముగిసిన తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు శుక్రవారం ప్రకటించారు. జిల్లాలో 14,75,036 ఓట్లు ఉండగా సర్ సర్వే తరువాత 13,89,592 ఓట్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వనివారు 85,444 ఉన్నట్లుగా పేర్కొన్నారు. సర్ ద్వారా తేలిన లెక్కలను పరిశీలిస్తే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 43,746 మంది చనిపోయినట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినవారు 22,131 మంది, రెండుచోట్ల ఓటు నమోదైనవారు (డబుల్ ఎంట్రీ) 15,676 మంది, ఆబ్సెంట్స్ 3,816 మంది, ఇతరులు 75 మంది ఉన్నట్లు నిర్ధారించారు. ఎన్యూమరేషన్ ఫారాల ఇవ్వని వారికి నోటీసులు జారీ చెయ్యనున్నారు. వారినుంచి సమాచారం సేకరించిన తరువాత పరిశీలిస్తారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో డెత్ ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరువాత భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఉన్నాయి. తణుకు నియోజకవర్గంలో అత్యధికంగా 7,685 మంది, తాడేపల్లిగూడెంలో 7,110, ఉండిలో 6,187, భీమవరం 6,311, పాలకొల్లు నియోజకవర్గంలో 6,428 మంది ఉన్నట్టు లెక్క తేలింది.
నియోజకవర్గాల వారీగా వివరాలు
ఆచంట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,79,987 మంది ఉండగా సర్ తరువాత 1,70,087 మంది ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారు 9,900 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. చనిపోయినఓట్లు 3541 మంది ఉండగా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్ళినవారు 2,420 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 1,684 మంది, ఆబెసెంట్స్ 248 మంది, ఇతరులు 7 మంది ఉన్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,95,062 మంది ఉండగా సర్ తరువాత 1,82,995 మంది ఉన్నారు. ఫారాలు ఇవ్వని వారు 12,067 మంది ఉన్నారు. చనిపోయిన ఓట్లు 6,428, శాశ్వతంగా బయటకు వెళ్ళినవారు 2,640 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 2,563 మంది, ఆబెసెంట్స్ 422 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో 1,71,053 మందికి 1,63,723 మంది ఓటర్లు ఉన్నారు. ఫారాలు ఇవ్వని వారు 7,330 మంది ఉన్నారు. చనిపోయిన వారు 4,484 మంది ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినవారు 1,222 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 1,389, ఆబ్సెంట్స్ 230, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
భీమవరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,52,549 మందికి 2,39,031 మంది లెక్క తేలారు. ఫారాలు ఇవ్వని వారు 13,518 మంది ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు. చనిపోయిన ఓట్లు 6,311 ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు 3,523, రెండు ఓట్లు ఉన్నవారు 3,311 మంది, ఆబ్సెంట్స్ 341 , ఇతరులు 32 మంది ఉన్నారు.
ఉండి నియోజకవర్గంలో 2,26,503 మందికి 2,15,271 మంది ఉన్నారు. ఫారాలు ఇవ్వని వారు 11,232 మంది ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు. చనిపోయినవారు 6,187 ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు 3,089 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 1,514 మంది, ఆబ్సెంట్స్ 436 మంది, ఇతరులు 6 మంది ఉన్నారు.
తణుకు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,35,359 మందికి 2,16,619 మంది ఉన్నారు. ఫారాలు ఇవ్వని వారు 18,740 మంది ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు.చనిపోయిన ఓట్లు 7,685, శాశ్వతంగా వెళ్లిపోయినవారు 6,600 మంది, డబుల్ ఎంట్రీ 3,052 , ఆబ్సెంట్స్ 1,394 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,14,523 మంది ఉండగా సర్ తరువాత 2,01,866 మంది ఉన్నారు. ఎన్యూ మరేషన్ ఫారాలు ఇవ్వని వారు 12,657 మంది ఉన్నట్లుగా లెక్క తేల్చారు. చనిపోయిన ఓట్లు 7,110, శాశ్వతంగా బయటకు వెళ్లినవారు 2,637 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 2,163 మంది, ఆబ్సెంట్స్ 745 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు వివరాలు సరిచూసుకోవాలి : డీఆర్వో
ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ ప్రభాకర్ సూచించారు.కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసి మరణిం చిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.జిల్లా ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పార్టీల ప్రతినిధులు చంద్రశేఖర్, శివరామ్, బలరామకృష్ణరాజు, సుబ్బరాజు, సత్య తదితరులు పాల్గొన్నారు.