Share News

విర్డ్‌ ఆసుపత్రికి రూ.7.53 లక్షల పరికరాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:30 AM

విర్డ్‌ ఆసుపత్రికి సమాజసేవలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు రూ.7.53 లక్షలు విలువైన శస్త్రచికిత్స పరికరాలను విరాళంగా అందచేశారు.

విర్డ్‌ ఆసుపత్రికి రూ.7.53 లక్షల పరికరాలు
విర్డ్‌ ఆసుపత్రికి అందించిన పరికరాలతో దాత, అధికారులు, వైద్యులు

ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విర్డ్‌ ఆసుపత్రికి సమాజసేవలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు రూ.7.53 లక్షలు విలువైన శస్త్రచికిత్స పరికరాలను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ ప్రతినిఽధులు మాట్లాడూతూ సమాజ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం తమ బ్యాంక్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇటువంటి పరికరాలు అందించడం వల్ల రోగులకు నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐకు ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో బ్యాంక్‌ అధికారి కాళిదాస్‌, విర్డ్‌ ఆసుపత్రి చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు, ఈవో భద్రాజీ, వి.నారాయణమూర్తి, నివృతరావు, సుధాకర్‌, వైద్యులు భవ్యచంద్‌, హమీద్‌, బాలాజీ, పీవీ నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:30 AM